how to apply pradhan mantri Ujjwala Yojana in online and know LPG Cylinder new rules
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం షాకింగ్ న్యూస్ అందించింది. దేశంలో గ్యాస్ సప్లై పై కొనసాగుతున్న అనిశ్ఛితి మరియు ఉజ్వల యోజన కుటుంబాల సగటు వార్షిక గ్యాస్ వినియోగాన్ని పరిశీలించిన తర్వాత ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు Ujjwala Yojana పథకం ద్వారా సంవత్సరానికి 9 LPG Cylinder పై అందిస్తున్న సబ్సిడీ ప్రయోజనాన్ని ఇక నుంచి కేవలం 4 సిలిండర్ లకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ విషయాన్ని పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ అధికారులు అధికారికంగా వెల్లడించారు.
ప్రభుత్వం ప్రకారం, ఉజ్వల యోజన కుటుంబాల సగటు వార్షిక LPG వినియోగాన్ని పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఏడాదిలో మొదటి 4 గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ అందుతుందని తెలిపింది. అంటే, 14.2 కిలోల సిలిండర్ పై ప్రస్తుతం అందిస్తున్న రూ. 300 సబ్సిడీ కొనసాగుతుందని స్పష్టం చేసింది.
ఉజ్వల యోజన 2016లో ప్రారంభమైనప్పుడు ఏడాదికి 12 సబ్సిడీ సిలిండర్లు లభించేవి. తర్వాత కాలంలో ఈ లిమిట్ ను ప్రభుత్వం 9 సిలిండర్ లకు తగ్గించింది. అయితే, ఇప్పుడు ఈ నెంబర్ ను కోడోత్ తగ్గించి 4 సిలిండర్ లకు పరిమితం చేశారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది ఉజ్వల లబ్ధిదారుల పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే, మీరు కూడా ఈ పథకం ద్వారా కొత్త సిలిండర్ కోసం అప్లై చేయాలనుకుంటే ఆన్లైన్ లో చాలా సులభంగా చేయవచ్చు.
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన 2.0 (PMUY 2.0) ద్వారా అర్హులైన మహిళలకు ప్రభుత్వం ఉచిత LPG కనెక్షన్ అందిస్తుంది. ఇప్పటి వరకు ఇంట్లో LPG కనెక్షన్ లేని పేద కుటుంబాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అర్హులైన మహిళలు ఆన్‌లైన్ ద్వారా చాలా సులభంగా ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్ కోసం అప్లై చేయడానికి మీకు కొన్ని అర్హతలు ఉండాలి. ముందుగా ఆ అర్హతలు ఏమిటో చూద్దాం.
పైన తెలిపిన అర్హతలు ఉన్నవారు అవసరమైన డాక్యుమెంట్లు రెడీ చేసుకొని ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఈ పథకానికి అప్లై చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు ఇప్పుడు చూద్దాం.
మీరు పైన తెలిపిన డాక్యుమెంట్లు రెడీ చేసుకున్న తర్వాత చాలా సులభంగా ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు. ఈ ఆన్లైన్ ప్రాసెస్ ను స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం.
Also Read: Chat GPT తో సోషల్ మీడియా క్యాప్షన్ లను ఈజీగా ఎలా రూపొందించాలో తెలుసుకోండి.!
అప్లికేషన్ ఆమోదం పొందిన తర్వాత సంబంధిత LPG డిస్ట్రిబ్యూటర్ ద్వారా కనెక్షన్ అందించబడుతుంది. ఉజ్వల 2.0 కింద అర్హులైన కుటుంబాలకు ఎటువంటి డిపాజిట్ లేకుండా ఉచిత LPG కనెక్షన్ లభిస్తుంది.