how to apply Pradhan Mantri Kisan Samman Nidhi in online
రైతుల కోసం భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక ముఖ్యమైన పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN). ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న కోట్ల మంది రైతులకు ఆర్థిక సహాయం చేస్తుంది. ముఖ్యంగా, ఎటువంటి ఆఫీస్ లేదా ఆఫీసర్ తో సంబంధం లేకుండా ఈ పథకం ద్వారా రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందుతుంది. అంటే రైతుల ఖాతాలోకి ప్రభుత్వం డబ్బులు నేరుగా జమ చేస్తుంది. ఈ పథకం కోసం ఆన్లైన్ లో ఈజీగా ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది రైతుల ఆదాయాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వ అందించిన ఒక పథకం. ఈ పథకం లేదా కార్యక్రమాన్ని 2019లో ప్రారంభించారు. రైతులకు పంట ఖర్చులు మరియు జీవన అవసరాలకు ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ప్రభుత్వం ప్రతి రైతుకు సంవత్సరానికి రూ. 6,000 రూపాయలు సహాయం చేస్తుంది. అయితే, ఈ మొత్తం డబ్బులు 3 విడతలుగా (రూ. 2,000 చొప్పున) అందిస్తుంది. ఈ పథకానికి అర్హత కలిగిన వారికి ప్రతి 4 నెలలకు ఒకసారి డబ్బు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుంది.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి భూమి కలిగిన రైతులు అందరూ అర్హులు అవుతారు. చిన్న మరియు పెద్ద రైతులందరూ కూడా ఈ పథకం పరిధిలోకి వస్తారు. రైతు కచ్చితంగా సాగు భూమి కలిగి ఉండాలి.
అయితే, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించే వారు, పెద్ద పెన్షన్ పొందేవారు, డాక్టర్లు మరియు ఇంజినీర్లు వంటి ప్రొఫెషనల్స్ ఈ పథకానికి అనర్హులు.
ఈ పథకానికి అప్లై చేయడానికి, ఆధార్ కార్డ్, భూమి రికార్డులు, బ్యాంక్ ఖాతా మరియు మొబైల్ నంబర్ అవసరం అవుతాయి. ఈ వివరాలతో e-KYC పూర్తి చేయడం చాలా ముఖ్యం.
Also Read: Vivo X300 FE: లాంచ్ కంటే ముందే వివో అప్ కమింగ్ ఫోన్ టాప్ ఫీచర్లు తెలుసుకోండి.!
ముందుగా మీరు PM-KISAN అధికారిక వెబ్ సైట్ లో రిజిస్టర్ అవ్వాలి. తర్వాత ‘కొత్త రైతు నమోదు’ పైన క్లిక్ చేయండి. ఇక్కడ సూచించిన వద్ద ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. క్రింద అడిగిన వద్ద రాష్ట్రం ఎంచుకోండి. చివరిగా ప్రక్కనే ఉన్న క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ‘get OTP’ పై నొక్కండి.
అందుకున్న OTP ఎంటర్ చేసి మీ వివరాలు నమోదు చేయండి. తర్వాత ఆధార్ మరియు బ్యాంక్ వివరాలు ఇవ్వాలి. మీ కంప్లీట్ వివరాలతో e-KYC పూర్తి చేయాలి. మీరు వివరాలు వెరిఫికేషన్ చేసిన తర్వాత మీరు అర్హత పొందితే మీ అకౌంట్ కు డబ్బు వస్తుంది.
ఈ పథకం ద్వారా ఇప్పటికే దేశంలోని 9.32 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.