ఇల్లు కదలకుండానే కలర్ ఓటర్ కార్డు పొందండి

HIGHLIGHTS

ఇంటినుండే కలర్ ఓటర్ ఐడి పొందడానికి సులభమైన మార్గం

మీ పాత ఓటర్ కార్డును మార్చుకొని కొత్త ఓటర్ కార్డును పొందాలా?

ఎన్నికల సంఘం ఇప్పుడు కలర్ మరియు ప్లాస్టిక్ ఓటరు ఐడి కార్డులను తయారు చేస్తోంది.

ఇల్లు కదలకుండానే కలర్ ఓటర్ కార్డు పొందండి

సాధారణంగా అందరి దగ్గర బ్లాక్ &వైట్ ఓటర్ కార్డు వుంటుంది. అయితే, ఇప్పుడు కొత్తగా అప్లై చేసిన వారికీ మరియు ఇటీవల కొత్తగా ఓటర్ కార్డులు తీసుకున్నారికీ కూడా కలర్ ఓటర్ కార్డులు చేతికందాయి. మీరు కూడా మీ పాత ఓటర్ కార్డును మార్చుకొని కొత్త ఓటర్ కార్డును పొందాలనుకుంటే ఇలా చేస్తే సరిపోతుంది.  

Digit.in Survey
✅ Thank you for completing the survey!

 ప్రజలకు సౌలభ్యాన్ని అందించే విషయాన్ని  దృష్టిలో ఉంచుకుని ఇంటినుండే కలర్ ఓటర్ ఐడి పొందడానికి సులభమైన మార్గం అందించింది. కంప్యూటర్ సహాయంతో ఇంట్లో కొత్త ఐడి కార్డును సృష్టించడానికి మీరు ఒక అప్లికేషన్ చేయాలి. అయితే కలర్ ఓటరు కార్డు కోసం ఎలా దరఖాస్తు చేయాలి? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం …

కలర్ ఓటరు కార్డు కోసం, మీరు మొదట nvsp (జాతీయ ఓటరు సేవా ప్రోటల్) వెబ్‌సైట్‌కు వెళ్లాలి.

ఇప్పుడు హోమ్ పేజీకి వెళ్లి అక్కడ నుండి మీరు పోర్టల్ బాక్స్ పై క్లిక్ చేయాలి.

సాధారణ ప్రజలు https://voterportal.eci.gov.in పోర్టల్‌కు వెళ్లాలి. ఇప్పుడు మీరు ఇక్కడ నమోదు చేసుకోవాలి.

ఆ తర్వాత అభ్యర్థులు తమ సొంత ఫోటోతో సహా కావాల్సిన సమాచారాన్ని ఇచ్చి సబ్మిట్ చేయాలి. ఈ సబ్మిట్ కు సంబంధించిన మొత్తం సమాచారం స్టోర్ చేసుకోవాలి.

అంతేకాకుండా, మీరు క్రొత్త కార్డును తయారు చేయవలసి వస్తే, మీరు ఫారం 6 నింపాలి. ఇక్కడ నుండి, మీరు దేశంలోని ఏ రాష్ట్రం నుండైనా ఓటరు ఐడి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

మీ మొత్తం సమాచారం ఇచ్చిన తరువాత, మీ ప్రాంతానికి చెందిన BLO (బూత్ లెవల్ ఆఫీసర్) ఎన్నికల కమిషన్ తరపున మీ ఇంటికి వచ్చి మీరు అందించిన సమాచారం మరియు అప్‌లోడ్ చేసిన పత్రాలను ధృవీకరిస్తారు.

అప్పుడు BLO తన నివేదికను ఇస్తుంది మరియు మీ కొత్త కలర్ ప్లాస్టిక్ ఓటరు ID కార్డు ఒక నెలలో మీ ఇంటికి వస్తుంది.

ఈ విధంగా మీరు ఇంట్లో మీ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ సహాయంతో మీ కొత్త మరియు కలర్ ఓటరు ఐడి కార్డును పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo