ఇంట్లో కూర్చొనే మీ EPF క్లెయిమ్ లేదా అడ్వాన్స్ పొందండి

ఇంట్లో కూర్చొనే మీ EPF క్లెయిమ్ లేదా అడ్వాన్స్ పొందండి
HIGHLIGHTS

ఇంట్లో కూర్చొని చిటికెలో మొబైల్ ఫోన్ ద్వారా చేసేయ్యొచ్చు

కేవలం ఆన్లైన్లో ఒక అప్లికేషన్ ఇవ్వడం ద్వారా అడ్వాన్స్ కోసం అప్లై

ఇది చాల సులభమైన పద్దతి కూడాను.

ఎంప్లాయిస్ తమ ప్రావిడెంట్ కి సంబంధించిన క్లెయిమ్ కోసం ఆఫీసులకు వెళ్లే పనిలేకుండా, ఇంట్లో కూర్చొని చిటికెలో మొబైల్ ఫోన్ ద్వారా చేసేయ్యొచ్చు. కేవలం ఆన్లైన్లో ఒక అప్లికేషన్ ఇవ్వడం ద్వారా అడ్వాన్స్ కోసం అప్లై లేదా ఈ EPF సెటిల్ చేసుకోవచ్చు. ఇది చాల సులభమైన పద్దతి కూడాను. 

అయితే, ఈ EPFO లో మీ వివరాలను, ముఖ్యంగా మీ బ్యాంకు ఖాతాను ఎంటర్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు సరిగా చూసుకుని, చెక్ చేసుకుని మరి ఎంట్రీ చేయాలి. ఒకవేళ, తప్పుగా ఎంటర్ చేస్తే మీ అమౌంట్ మీరు తప్పుగా ఎంటర్ చేసిన ఆ బ్యాంకు ఖాతాకు మళ్ళించబడుతుంది. కాబట్టి, జాగ్రత్తగా ఎంటర్ చేయండి.

EPF క్లెయిమ్ చేయడం ఎలా?

ముందుగా EPFO యొక్క అధికారక వెబ్సైట్ లోకి ప్రవేశించి, మీ యొక్క UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్) ని యాక్టీవేట్ చేసుకోవాలి( ఇప్పటి వరకు చేయనివారికోసం). వెబ్సైట్ కోసం EPFO  పైన క్లిక్ చేయండి.   

వారి సంస్థ నుండి EPF డబ్బు బదిలీ కోసం ఎదురుస్తున్నవారు మీ అభ్యర్థనను,  ఆన్లైన్లో EPFO ​​వెబ్సైట్ ద్వారా సమర్పించవచ్చు. మీ UAN మరియు రిజిస్టర్డ్ మొబైల్ నంబరుతో ఇక్కడ  మేము సూచించిన విధంగా చేయండి.

1. మొదట మీరు www.epfindia.gov.in వెబ్సైటుకు వెళ్లి ఇక్కడ చూపిన విధంగా క్లిక్ చేయండి .

2. Employee పై క్లిక్ చేసిన తర్వాత మీరు UAN / ఆన్లైన్ సర్వీస్ (OCS / OTP) యొక్క సభ్యునికి దాని సర్వీసు పేజీకి మళ్ళించబడతారు.

3. సర్వీసుల కింద సభ్యుని UAN / ఆన్లైన్ సర్వీస్ (OCS / OTP) పై క్లిక్ చేసిన తర్వాత మీరు మీ UAN మరియు పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన పట్టికలో టైప్ చేయండి.

4. మీ UAN మరియు పాస్ వర్డు టైప్ చేసి  ఎంటర్ చేసిన తర్వాత, మీరు Manage పైన నొక్కండి. ఆ తర్వాత దానిలో కనిపించే 4 విభాగాలలో KYC పైన క్లిక్ చేయండి.

5. ఈ KYC లో మీ యొక్క ఆధార్, PAN మరియు బ్యాంకు వివరాలను నమోదుచేసి ఎంటర్ చేయండి. (ఈ వివరాలను ఇప్పటి వరకు నమోదు చేయని వారికోసం) ఇవి మీకు అప్డేట్ అవడానికి కొంత సమయం పడుతుంది.

6. ఇప్పుడు పైన కనిపించే, Online Services పైన నొక్కడం ద్వారా లోనికి ప్రవేశించి, అందులోని Claim ఎంచుకోండి. ఇక్కడ మీ వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.    

అడ్వాన్స్ కోసం ఎలా అప్లై చెయ్యాలి?

1. మొదట మీరు www.epfindia.gov.in వెబ్సైటుకు వెళ్లి ఇక్కడ చూపిన విధంగా క్లిక్ చేయండి .

2.  తర్వాత మీరు UAN / ఆన్లైన్ సర్వీస్ (OCS / OTP) యొక్క సభ్యునికి దాని సర్వీసు పేజీకి మళ్ళించబడతారు.

3. సర్వీసుల కింద సభ్యుని UAN / ఆన్లైన్ సర్వీస్ (OCS / OTP) పై క్లిక్ చేసిన తర్వాత మీరు మీ UAN మరియు పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన పట్టికలో టైప్ చేయండి.

4. మీ UAN మరియు పాస్ వర్డు టైప్ చేసి  ఎంటర్ చేసిన తర్వాత, మీరు Manage పైన నొక్కండి. ఆ తర్వాత దానిలో కనిపించే 4 విభాగాలలో KYC పైన క్లిక్ చేయండి.

5. ఈ KYC లో మీ యొక్క ఆధార్, PAN మరియు బ్యాంకు వివరాలను నమోదుచేసి ఎంటర్ చేయండి. (ఈ వివరాలను ఇప్పటి వరకు నమోదు చేయని వారికోసం) ఇవి మీకు అప్డేట్ అవడానికి కొంత సమయం పడుతుంది.

6. ఇప్పుడు పైన కనిపించే, Online Services పైన నొక్కడం ద్వారా లోనికి ప్రవేశించి, అందులోని Claim ఎంచుకోండి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ యొక్క చివరి 4 అంకెలను నమోదు చేసి ఎంటర్ చేయండి.

7.  ఇక్కడ మీ వివరాలతో పాటుగా 'I  Want To Apply For' అని కనిపిస్తుంది. ఇందులోకి వెళ్లి PF Advance (Form-31) ఎంచుకొని మీరు ఎటువంటి అవసరం కోసం మీరు  మీ PF నుండి అడ్వాన్స్ కోసం అప్ప్లై చేస్తున్నారో ఎంచుకొవాల్సివుంటుంది.

8. ఇక్కడ మీ పూర్తి చిరునామా నమోదు  చేసిన తరువాత సబ్మిట్ చేయాలి.

9. ఆన్లైన్ అవకాశం లేనివారు EPF ఆఫీసునందు Form – 31 పూర్తి వివరాలను వ్రాసి సమర్పించవచ్చు.

ముఖ్య గమనిక :మీరు మీ (బ్యాంకు) వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ చేసే ముందు వివరాలు సరైనవేనని పూర్తిగా నిర్ధారించుకున్న తరువాతే ముందుకు వెళ్ళండి.  ఎందుకంటే, మీ బ్యాంకు వివరాలు తప్పుగా ఎంటర్ చేస్తే మీ డబ్బు ఆ అకౌంటుకు వెళుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo