ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లు చేసే మోస్ట్ కామన్ మిస్టేక్స్..!!

ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లు చేసే మోస్ట్ కామన్ మిస్టేక్స్..!!
HIGHLIGHTS

ఫోన్ వాడే సమయంలో తెలియకుండా కొన్ని తప్పులు చేస్తుంటారు

ఆండ్రాయిడ్ యూజర్స్ చేసే మోస్ట్ కామన్ మిస్టేక్స్

మీరు శ్రద్ద వహించకపోతే నష్టపోతారు

ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా గడవదు. అయితే, వారివారి అవసరాలను బట్టి చాలా మంది ఎక్కువ సమయం ఈ స్మార్ట్ ఫోన్ తోనే గడుపుతున్నారు. కానీ, ఫోన్ వాడే సమయంలో తెలియకుండా కొన్ని తప్పులు చేస్తుంటారు. వాటిలో, అత్యధికంగా ఆండ్రాయిడ్ ఫోన్ వాడేవారు చేసే మోస్ట్ కామన్ మిస్టేక్స్ ఉంటాయి. మరి ఆ మోస్ట్ కామన్ మిస్టేక్స్ గురించి ఈ రోజు తెలుసుకుందాం. అంటే, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తరచుగా చేసే తప్పుల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

బ్యాకప్ చెయ్యకపోవడం

బ్యాకప్ చెయ్యకపోవడం అనేది చాలా కామన్ మిస్టేక్. చాలా మాది వారి ఫోన్ ను బ్యాకప్ చేయకుండానే వాడుతుంటారు. అయితే, ఫోన్ పోగొట్టుకున్నా లేక ఏదైనా సమస్య కారణంగా ఫోన్ పనిచెయ్యకపొతే మీ డేటా మొత్తాన్ని పోగొట్టుకుంటారు.         

థర్డ్ పార్టీ యాప్స్ డౌన్ లోడింగ్

Google Play Store నుండి కాకుండా మరింకెక్కడి నుండైనా యాప్స్ డౌన్ లోడ్ చేస్తుంటారు. అవే 'థర్డ్ పార్టీ యాప్స్' మరియు వీటిని అవసరాన్ని డౌన్ లోడ్ చేసుకోని ఉపయోగిస్తుంటారు. కానీ, ఇది సాధారణ విషయం మాత్రం కాదు మరియు ఇది తర్వాత మీ ఫోన్‌కు హాని కలిగించవచ్చు. అందుకే, సెట్టింగ్స్ లో ఉన్న యాప్ మెనూలో అన్నోన్ యాప్స్ ఇన్స్టాలేషన్ ఎంపికను ఆఫ్ చేయాలి.

యాప్ డోన్ లోడ్ సమయంలో అజాగ్రత్త

ఒక యాప్ డోన్ లోడ్ సమయంలో మీరు మీ ఫోన్ అనుమతుల పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఎందుకంటే, చాలా యాప్స్ మీ కాంటాక్ట్ లిస్ట్, మెసేజెస్ మరియు స్టోరేజ్ కోసం అనుమతిని కోరతాయి. ఇక్కడ మీరు శ్రద్ద వహించకపోతే నష్టపోతారు.             

ఫోన్ లాక్ కోసం సులభమైన పాస్వర్డ్ ఉంచడం

ముఖ్యంగా, ఫోన్ లాక్ కోసం సులభమైన పాస్వర్డ్ ఉంచడం ఆండ్రాయిడ్ ఫోన్ వాడేవారు చేసే మోస్ట్ కామన్ మిస్టేక్. ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ అన్లాక్ మీకు సులభంగా మరియు సౌకర్యవంతంగా అనిపించవచ్చు. అయితే, ఫోన్ అన్లాక్ కోసం సమర్ధవంతమైన మరియు బలమైన పాస్వర్డ్ ఉంచడం మంచిది.

యాప్ ను ఇన్‌స్టాల్ చేయడానికి APK ఫైల్ ఉపయోగించడం

గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో లేని ఎన్నో యాప్స్ కూడా వెలుపల ఉన్నాయి. వాటికోసం APK ఫైల్ డౌన్ లోడ్ చేసుకొని దానిద్వారా ఆ యాప్స్ ను ఇన్‌స్టాల్ చేస్తారు. కానీ, ఇది గూగుల్ ప్లే స్టోర్ ఆమోదించబడనందున ఇది ప్రమాదకరం.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo