అమౌంట్ రాంగ్ అకౌంట్ కి ట్రాన్స్ ఫర్ చేశారా?

అమౌంట్ రాంగ్ అకౌంట్ కి ట్రాన్స్ ఫర్ చేశారా?
HIGHLIGHTS

కొన్ని తప్పులు ఊహించని భారీ నష్టాన్ని కలిగిస్తాయి

డబ్బును అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేసేప్పుడు చాల జాగ్రత్త వహించాలి

IFSC కోడ్ కూడా మీ ట్రాన్సాక్షన్ ను ప్రభావితం చేస్తుంది

అనుకోకుండా అప్పుడప్పుడు కొన్ని తప్పులు జరుగుతుంటాయి.కానీ, కొన్ని తప్పులు ఊహించని భారీ నష్టాన్ని కలిగిస్తాయి. వాటిలో  ముఖ్యమైనది అమౌంట్ రాంగ్ ట్రాన్సఫర్. ఆన్లైన్లో బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బును వేరే అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేసేప్పుడు చాల జాగ్రత్త వహించాలి. లేదంటే, అమౌంట్ ట్రాన్స్ ఫర్ సమయంలో మనం చేసే చిన్న తప్పు మీకు భారీ నష్టాన్ని కలిగించవచ్చు. కానీ, అమౌంట్ ట్రాన్స్ ఫర్ సమయంలో ఏదైనా తప్పు జరిగితే బ్యాంక్ ను ఆ తప్పును గురించి బ్యాంక్ ను సంప్రతించి దాన్ని సరిచేసుకునే అవకాశం ఉంటుంది.

ముఖ్యంగా, అకౌంట్ నంబర్ ఎంటర్ చేసేప్పుడు జాగ్రత్తగా సరి చూసుకోవాలి. అంతేకాదు, IFSC కోడ్ కూడా మీ ట్రాన్సాక్షన్ ను ప్రభావితం  చేస్తుంది. అందుకే, అనుకోకుండా మీ డబ్బు తప్పు అకౌంట్ లో డిపాజిట్ అయితే ఏమి చేయాలి? అని ఈరోజు తెలుసుకుందాం.

1. మొదట నేరుగా మీ బ్యాంక్ కు వెళ్ళండి

2. మీ వివరాలను ఆపరేషన్స్ మేనేజర్ కు అందించండి

3. బ్యాంక్ ఆపరేషన్స్ మేనేజర్ మీకు చాలా వరకు సహాయం చెయ్యగలరు

4. అలాగే, మీరు డబ్బు పంపిన బ్యాంక్ కి వెళ్లి అక్కడి మేనేజర్ ని కలిసి వివరాలను అందచేయ్యండి

5. ముఖ్యంగా, ప్రతి రోజు మీ బ్యాంక్ కస్టమర్ కేర్ ని సంప్రతించి వివరాలను తెలుసుకోండి

ఈ విధంగా డబ్బు తప్పు అకౌంట్ లో డిపాజిట్ చేస్తే తిరిగిపొందే అవకాశం ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo