govt tested Cell Broadcast Alert System for Extremely severe alert
ఇటీవల దేశంలోని చాలా మంది మొబైల్ ఫోన్ లలో కూడా ఒక్కసారిగా “Extremely severe alert” అనే మెసేజ్ కనిపించింది. ఇది చాలా మందిని ఆశ్చర్యానికి కూడా గురిచేసింది. అయితే, ఈ అలర్ట్ లో “ఇది ఒక టెస్ట్ మెసేజ్ మాత్రమే, ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు” అని నోట్ ను స్పష్టంగా పేర్కొన్నారు. విషయం ఏమిటంటే ఇది సాధారణ SMS కాదు. ఇది భారత ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన Cell Broadcast Alert System పరీక్షలో భాగం.
సెల్ బ్రాడ్కాస్ట్ అనేది ఒక ప్రత్యేక టెక్నాలజీ మరియు దీని సహాయంతో ఒకే సమయంలో లక్షల మంది మొబైల్ యూజర్లకు మెసేజ్ పంపవచ్చు. అంతేకాదు, నెట్‌వర్క్ బిజీగా ఉన్నా కూడా యూజర్లకు మెసేజ్ చేరుతుంది. మరో మంచి విషయం ఏమిటంటే, ప్రత్యేకంగా ఒక ప్రాంతానికి మాత్రమే అలర్ట్ పంపే వీలుంది. ఇది సాధారణ SMS కంటే చాలా వేగంగా మరియు నమ్మకంగా పనిచేస్తుంది.
సహజ విపత్తులు మరియు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సమాచారం అందించేందుకు భారత్ ప్రభుత్వం ఈ కొత్త సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. అంటే, తుఫాన్, వరదలు, భూకంపాలు మరియు తర అత్యవసర పరిస్థితులు వంటి సందర్భాల్లో ముందుగానే హెచ్చరికలు ఇవ్వడం దీని ప్రధాన లక్ష్యం. హెచ్చరికలు తక్షణమే అందించడం ద్వారా ప్రాణ నష్టం తగ్గించవచ్చు.
మీరు కూడా ఈ మెసేజ్ అందుకుంటే అందులో “This is a test message” అని ఉండటం గమనించవచ్చు. అంటే, ఇది సిస్టమ్ సరిగ్గా పనిచేస్తుందో లేదో పరీక్షించడం కోసం పంపించిన టెస్ట్ మెసేజ్. దీని ముఖ్య ఉద్దేశం అన్ని నెట్ వర్క్ లలో ఈ అలర్ట్ చేరుతుందో చూడటం మరియు యూజర్లు అలర్ట్ ఎలా కనిపిస్తుందో తెలుసుకోవడం అవుతుంది.
ఈ అలర్ట్ మీ ఫోన్ సైలెంట్ మోడ్ లో ఉన్నా కూడా పెద్ద సౌండ్ తో వస్తుంది. అలాగే, మీ ఫోన్ స్క్రీన్ పై పెద్దగా కనిపిస్తుంది. లోకల్ లాంగ్వేజ్ లో మెసేజ్ అందుతుంది. అంటే, ప్రాంతానికి అనుగుణంగా మెసేజ్ భాష మారుతుంది. ఈ అలర్ట్ కు ఇంటర్నెట్ అవసరం ఉండదు. ఈ ప్రత్యేకత కారణంగా అత్యవసర పరిస్థితుల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Also Read: CMF Watch 3 Pro: నథింగ్ అప్ కమింగ్ స్మార్ట్ వాచ్ టాప్ ఫీచర్స్ తెలుసుకోండి.!
మీ ఫోన్ లో వచ్చిన అలర్ట్ లో టెస్ట్ మెసేజ్ అని ఉంటే ఎలాంటి చర్య అవసరం లేదు. అయితే, నిజమైన అలర్ట్ అందుకుంటే మాత్రం సూచనలు జాగ్రత్తగా చదవండి మరియు వెంటనే అవసరమైన చర్యలు తీసుకోండి.