Cell Broadcast Alert System: భారత్‌లో విపత్తు హెచ్చరికల కొత్త టెక్నాలజీ వినియోగం.!

HIGHLIGHTS

చాలా మంది మొబైల్ ఫోన్ లలో కూడా ఒక్కసారిగా Extremely severe alert అనే మెసేజ్ కనిపించింది

ఇది భారత ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన Cell Broadcast Alert System పరీక్షలో భాగం

ఇది సాధారణ SMS కంటే చాలా వేగంగా మరియు నమ్మకంగా పనిచేస్తుంది

Cell Broadcast Alert System: భారత్‌లో విపత్తు హెచ్చరికల కొత్త టెక్నాలజీ వినియోగం.!

ఇటీవల దేశంలోని చాలా మంది మొబైల్ ఫోన్ లలో కూడా ఒక్కసారిగా “Extremely severe alert” అనే మెసేజ్ కనిపించింది. ఇది చాలా మందిని ఆశ్చర్యానికి కూడా గురిచేసింది. అయితే, ఈ అలర్ట్‌ లో “ఇది ఒక టెస్ట్ మెసేజ్ మాత్రమే, ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు” అని నోట్ ను స్పష్టంగా పేర్కొన్నారు. విషయం ఏమిటంటే ఇది సాధారణ SMS కాదు. ఇది భారత ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన Cell Broadcast Alert System పరీక్షలో భాగం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Cell Broadcast Alert System అంటే ఏమిటి?

సెల్ బ్రాడ్కాస్ట్ అనేది ఒక ప్రత్యేక టెక్నాలజీ మరియు దీని సహాయంతో ఒకే సమయంలో లక్షల మంది మొబైల్ యూజర్లకు మెసేజ్ పంపవచ్చు. అంతేకాదు, నెట్‌వర్క్ బిజీగా ఉన్నా కూడా యూజర్లకు మెసేజ్ చేరుతుంది. మరో మంచి విషయం ఏమిటంటే, ప్రత్యేకంగా ఒక ప్రాంతానికి మాత్రమే అలర్ట్ పంపే వీలుంది. ఇది సాధారణ SMS కంటే చాలా వేగంగా మరియు నమ్మకంగా పనిచేస్తుంది.

ఈ కొత్త టెక్ తో అలర్ట్ అవసరం ఏమిటి?

సహజ విపత్తులు మరియు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సమాచారం అందించేందుకు భారత్ ప్రభుత్వం ఈ కొత్త సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. అంటే, తుఫాన్, వరదలు, భూకంపాలు మరియు తర అత్యవసర పరిస్థితులు వంటి సందర్భాల్లో ముందుగానే హెచ్చరికలు ఇవ్వడం దీని ప్రధాన లక్ష్యం. హెచ్చరికలు తక్షణమే అందించడం ద్వారా ప్రాణ నష్టం తగ్గించవచ్చు.

టెస్ట్ మెసేజ్ ఎందుకు పంపారు?

మీరు కూడా ఈ మెసేజ్ అందుకుంటే అందులో “This is a test message” అని ఉండటం గమనించవచ్చు. అంటే, ఇది సిస్టమ్ సరిగ్గా పనిచేస్తుందో లేదో పరీక్షించడం కోసం పంపించిన టెస్ట్ మెసేజ్. దీని ముఖ్య ఉద్దేశం అన్ని నెట్‌ వర్క్‌ లలో ఈ అలర్ట్ చేరుతుందో చూడటం మరియు యూజర్లు అలర్ట్ ఎలా కనిపిస్తుందో తెలుసుకోవడం అవుతుంది.

Cell Broadcast Alert System

ఈ కొత్త అలర్ట్ ప్రత్యేకత ఏమిటి?

ఈ అలర్ట్ మీ ఫోన్ సైలెంట్ మోడ్ లో ఉన్నా కూడా పెద్ద సౌండ్‌ తో వస్తుంది. అలాగే, మీ ఫోన్ స్క్రీన్ పై పెద్దగా కనిపిస్తుంది. లోకల్ లాంగ్వేజ్ లో మెసేజ్ అందుతుంది. అంటే, ప్రాంతానికి అనుగుణంగా మెసేజ్ భాష మారుతుంది. ఈ అలర్ట్ కు ఇంటర్నెట్ అవసరం ఉండదు. ఈ ప్రత్యేకత కారణంగా అత్యవసర పరిస్థితుల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Also Read: CMF Watch 3 Pro: నథింగ్ అప్ కమింగ్ స్మార్ట్ వాచ్ టాప్ ఫీచర్స్ తెలుసుకోండి.!

మీరు ఏమి చేయాలి?

మీ ఫోన్ లో వచ్చిన అలర్ట్ లో టెస్ట్ మెసేజ్ అని ఉంటే ఎలాంటి చర్య అవసరం లేదు. అయితే, నిజమైన అలర్ట్ అందుకుంటే మాత్రం సూచనలు జాగ్రత్తగా చదవండి మరియు వెంటనే అవసరమైన చర్యలు తీసుకోండి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile