ఎవెంజర్స్ ఎండ్ గేమ్ విలన్ థానోస్ హ్యాండ్ తో గూగుల్ అద్భుతం

ఎవెంజర్స్ ఎండ్ గేమ్ విలన్ థానోస్ హ్యాండ్ తో గూగుల్ అద్భుతం

ట్రెండ్ ని సెట్ చెయ్యడం గూగుల్ కి తెలిసినంతగా, మరెవరికి తెలియదేమో అనిపిస్తుంది. ఎందుకంటే, రేపు రిలీజ్ కానున్న సూపర్ ఫిక్షన్ సినిమా అయినటువంటి, మార్వెల్స్ ఎవెంజర్ ఎండ్ గేమ్ యొక్క సూపర్ విలన్ అయినటువంటి థానోస్ మీకు గుర్తుండేవుంటాడు. ముఖ్యంగా, అందరి దగ్గరినుండి దోచుకున్న మణులను తన చేతికి అమర్చిన ఒక బంగారు కవచంలో అమర్చుతాడు. ఆ చేతిని ఇప్పుడు మీరు గూగుల్ పేజీలో చూడవచ్చు.

అందులో కొత్తగా ఏముంది అనుకుంటున్నారా? అవును కొత్తగా ఒక విషయం వుంది. అది కూడా గూగుల్ ప్రత్యేకముగా అందించే. గూగుల్ సెర్చ్ బారులో THANOS అని సెర్చ్ చేయండి. మీకు గూగుల్ పేజీలో కుడి వైపున థానోస్ ఇమేజిలతో పాటుగా, అని బంగారు చెయ్యి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ చేతిమీద ఒక్క సరి నొక్కి చూడండి ( క్లిక్ చేయండి).

 ఇక ఒక్కసారిగా ఆ చేయి చిటికివేస్తుంది, వెంటనే మొదటి పోర్టులో చివరి సీన్ లో చూపించినట్లుగా, గూగుల్ పేజీలోని ఎవెంజర్స్ అందరూ ఒక్కొక్కరిగా చెరిగిపోతారు. చూడడానికి చాల అద్భుతంగా అనిపిస్తుంది మరియు ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. అయితే, మరొక్క సారి అదే చేతిపైన నొక్కారంటే, ఇక ఆ చేయు ముడుచుకుంటుంది. ఇక వెంటనే, మాయమైపోయిన అన్ని ఫోటోలు, వార్తలు కూడా మరలా తిరిగి యధాస్థానికి వస్తాయి.                           

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo