జోకర్ మాల్వేర్ అలర్ట్: మీ ఫోన్ లో ఈ 4 యాప్స్ ఉంటే వెంటనే తీసెయ్యండి.. లేకపోతే.!

HIGHLIGHTS

గూగుల్ ప్లే స్టోర్ లో జోకర్ మాల్వేర్ పేరు మళ్ళీ వినిపిస్తోంది

జోకర్ మాల్వేర్ గూగుల్ ప్లే స్టోర్ లో తిరిగిచ్చినట్లు కనిపిస్తోంది

4 యాప్స్ దీని భారిన పడినట్లు గుర్తించిన గూగుల్

జోకర్ మాల్వేర్ అలర్ట్: మీ ఫోన్ లో ఈ 4 యాప్స్ ఉంటే వెంటనే తీసెయ్యండి.. లేకపోతే.!

జోకర్ మాల్వేర్ అలర్ట్: గూగుల్ ప్లే స్టోర్ లో జోకర్ మాల్వేర్ పేరు మళ్ళీ వినిపిస్తోంది. అంటే, జోకర్ మాల్వేర్ గూగుల్ ప్లే స్టోర్ లో తిరిగిచ్చినట్లు కనిపిస్తోంది. రీసెంట్ గా ప్లే స్టోర్ లోని 4 యాప్స్ దీని భారిన పడినట్లు గుర్తించిన గూగుల్, ఈ నాలుగు యాప్స్ ను వెంటనే స్టోర్ నుండి తొలగించింది. అయితే, అప్పటికే చాలా మంది ఈ నాలుగు యాప్స్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. అందుకే, మీ ఫోన్ లో ఈ 4 యాప్స్ ఉంటే వెంటనే తీసెయ్యండి. తద్వారా, మీ ఫోన్ ను ఈ మాల్వేర్ భారీ నుండి సురక్షితంగా ఉంచవచ్చు.   

Digit.in Survey
✅ Thank you for completing the survey!

 

అసలు ఏమిటి ఈ జోకర్ మాల్వేర్?

జోకర్ మాల్వేర్ అనేది మీకు తెలియకుండానే మీ ఫోన్ నుండి ఆన్లైన్ యాడ్స్ మరియు ఆన్లైన్ సర్వీస్ లకు సబ్ స్క్రిప్షన్ ను యాక్సెస్ చేస్తుంది. అంటే, మీకు తెలియకుండానే మీరు తీసుకోని సర్వీస్ లకు మీరు డబ్బు చెల్లిస్తారు. అంటే, ఈ మాల్వేర్ మిమల్ని జోకర్ చేస్తుంది. ఇది ఎంత ప్రమాదకరమైన మాల్వేర్ అంటే, చెల్లింపులను రహస్యంగా ఆమోదించడానికి SMS నుండి OTP లను కూడా యాక్సెస్ చేయగలదు. మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను చూసుకునే వరకూ మీకు ఈ విషయం గురించి తెలియదు.

లేటెస్ట్ గా జోకర్ మాల్వేర్ భారిన పడిన యాప్స్

సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ కంపెనీ ప్రాడియో ప్రకారం, ఈ జోకర్ మాల్వేర్ గూగుల్ ప్లే స్టోర్‌లోని నాలుగు యాప్‌ లలో కనుగొనబడింది. ఈ నాలుగు యాప్ లను ఈ క్రింద ఇచ్చిన లిస్ట్ లో చూడవచ్చు.

1. Smart SMS Message

2. Blood Pressure Monitor

3. Voice Language Translator

4. Quick Text Message  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo