ఇక గూగుల్ ప్లే మూవీస్ ఆప్ ద్వారా సినిమాలు మరియు టీవీ కార్యక్రమాలు

ఇక గూగుల్ ప్లే మూవీస్ ఆప్ ద్వారా సినిమాలు మరియు టీవీ కార్యక్రమాలు
HIGHLIGHTS

గూగుల్ త్వరలో ఈ ఫీచర్ ని తీసుకురావచ్చు.

గూగుల్ త్వరలో తన గూగుల్ ప్లే మూవీస్ అప్లికేషన్ లో చలనచిత్రాలు మరియు టీవీ కార్యక్రమాల కోసం ఉచిత యాడ్-ఆధారిత లైబ్రరీని ప్రారంభించవచ్చు. ఈ వార్త చాలా ఆన్లైన్లో నివేదించబడింది. క్రొత్త గూగుల్ ప్లే మూవీస్ అప్డేట్ లో, చలనచిత్రాలు మరియు టీవీ కార్యక్రమాల కోసం ఒక ప్రత్యేక కేటగిరి జోడించబడుతుంది, దీనిలో యాడ్ తో సహా కంటెంట్ అందుబాటులో ఉంటుంది మరియు దీనిని వినియోగదారులు ఉచితంగా పొందగలుగుతారు. అమెరికన్ స్ట్రీమింగ్ సర్వీస్ వుడు వంటి ఉచిత యాడ్-సపోర్ట్ కంటెంట్‌ను గూగుల్ అందిస్తుందని చాలా నివేదికలు వెల్లడించాయి.

గూగుల్ ప్లే మూవీస్ అప్లికేషన్ ప్రస్తుతం వినియోగదారులను సినిమాలు కొనడానికి లేదా సినిమాలను అద్దె చెల్లించి చూడటానికి అవకాశం అందించింది. అయితే, XDA డెవలపర్స్ యొక్క నివేదిక ప్రకారం, గూగుల్ ప్లే మూవీస్ అప్లికేషన్ (APP) యొక్క APK టియర్‌ డౌన్ వెర్షన్ v4.18.37 సంస్థ త్వరలో ఉచిత ప్రకటనల ఆధారిత సినిమాలు మరియు టివి షోల కోసం కొత్త కేటగిరీని ప్రవేశపెట్టడానికి సన్నద్ధమవుతోందని సూచించింది.  గూగుల్ ప్లే మూవీస్ APK లో కనుగొనబడిన ఈ సమాచారం 9to5Google నివేదికలో కూడా నిర్ధారించబడింది. ఈ నివేదిక ప్రకారం, గూగుల్ త్వరలో ఈ ఫీచర్ ని తీసుకురావచ్చు.

కరోనావైరస్ ప్రపంచంలోని అనేక దేశాలలో లాక్డౌన్ కి కారణమైంది మరియు ప్రజలు ఇంటి నుండి పని చేస్తున్నారు. అదే సమయంలో, ఇళ్లలో నివసించే విద్యార్థులు మరియు ప్రజలు లేదా షాపులు మరియు మార్కెట్ల నుండి రోజువారీ పని చేసే వ్యాపారులు, అందరూ ఇంట్లో కూర్చొని ఇంటర్నెట్ సహాయంతో ప్రపంచానికి కనెక్ట్ చేయబడ్డారు. అటువంటి పరిస్థితిలో, ప్రతిక్కరి వినోదం కేవలం ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సర్వీస్ మొదలైన వాటిపై ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo