Gmail Address Change: కోట్ల మంది జిమెయిల్ యూజర్లకు గుడ్ న్యూస్ అందించిన గూగుల్.!

HIGHLIGHTS

ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా యూజర్ బేస్ కలిగి ఉన్న మెయిల్ సర్వీస్ గా జిమెయిల్ నిలుస్తుంది

జీమెయిల్ యూజర్లు ఆది నుంచి ఒక ప్రధాన సమస్య గురించి ఎక్కువగా చెబుతారు

Gmail Address Change ఈ పాలసీని మార్చబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది

Gmail Address Change: కోట్ల మంది జిమెయిల్ యూజర్లకు గుడ్ న్యూస్ అందించిన గూగుల్.!

Gmail Address Change: ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా యూజర్ బేస్ కలిగి ఉన్న మెయిల్ సర్వీస్ గా జిమెయిల్ నిలుస్తుంది. అయితే, జీమెయిల్ యూజర్లు ఆది నుంచి ఒక ప్రధాన సమస్య గురించి ఎక్కువగా చెబుతారు. అదే, జిమెయిల్ అడ్రస్ చేంజ్ లేదా జిమెయిల్ అడ్రస్ ఎడిట్ ఆప్షన్. ఒకసారి జిమెయిల్ క్రియేట్ చేసిన తర్వాత ఈ మెయిల్ అడ్రస్ క్రియేట్ చేస్తే (name@gmail.com) ఎన్నటికీ మార్చడం కుదరదు. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే వాటిని సరి చేసి అదే మెయిల్ అడ్రస్ ను కొనసాగించడానికి అవకాశం లేదు, ఇది యూజర్లకు పెద్ద సమస్యగా మారింది. అయితే, ఈ పద్ధతికి గూగుల్ ఇప్పుడు చరమ గీతం పాడనుంది. Google ఈ పాలసీని మార్చబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Gmail Address Change: కొత్త మార్పులు ఏమిటి?

ఈ కొత్త అప్డేట్ గురించి గూగుల్ లేటెస్ట్ గా తన సపోర్ట్ డాక్యుమెంటేషన్‌ లో చేసిన అప్‌డేట్ ప్రకారం, పర్సనల్ @gmail.com అకౌంట్ కలిగిన యూజర్లు వారి జిమెయిల్ అడ్రెస్‌ మార్చుకునే అవకాశం త్వరలో పొందనున్నారు. మీకు క్లియర్ గా చెప్పాలంటే, మీ పాత జిమెయిల్ అకౌంట్ డిలీట్ చేయాల్సిన పని లేకుండా ఆ జిమెయిల్ అడ్రస్ లో తప్పులు సరిదిద్దుకోవడం లేదా కొత్త పేరును కూడా సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది.

Gmail Address Change

అయితే, మీకు వెంటనే పాత జిమెయిల్ అడ్రెస్‌ ఏమవుతుంది? అనే డౌట్ రావచ్చు. గూగుల్ కొత్త విధానం ప్రకారం, మీరు కొత్త Gmail అడ్రస్ తీసుకున్న తర్వాత పాత అడ్రస్ Alias‌ గా మారుతుంది. అంటే, సాధారణంగా పెట్ నేమ్ ఒరిజినల్ నేమ్ ఉన్నప్పుడు మనం ఉరఫ్ లేదా అలియాస్ అని పిలుస్తాము కదా, అలాగే ఇది కూడా ఉంటుంది. అంతేకాదు, మీ ఇన్ పాత అడ్రస్‌కు వచ్చిన మెయిల్స్ కూడా కొత్త Inbox‌ లోకి వస్తాయి. అంటే, ఒక్క అకౌంట్‌ లోనే రెండు జిమెయిల్ అడ్రస్‌ లు పనిచేస్తాయి.

Also Read: Sony మరియు Panasonic Dolby సౌండ్ బార్స్ భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతున్నాయి.. ఎక్కడంటే.!

ఎన్నిసార్లు మార్చుకోవచ్చు?

పైన తెలిపిన వెసులుబాటు తో జిమెయిల్ అడ్రస్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు? అని సహజంగానే మనకు డౌట్ వస్తుంది. అయితే, విషయం గురించి గూగుల్ ఒక నిర్దిష్టమైన లెక్క లేదా అప్డేట్ ను ఇంకా అందించలేదు. కానీ ఆన్లైన్ లో లీకైన సమాచారం మరియు సపోర్ట్ పేజీల ప్రకారం, 12 నెలలకు ఒకసారి మాత్రమే Gmail అడ్రస్ మార్చుకునే అవకాశం ఉండచ్చని తెలుస్తోంది. అంతేకాదు, గరిష్టంగా 3 సార్లు మాత్రమే మార్చుకునే అవకాశం ఉండవచ్చని కూడా ఈ లీక్స్ సూచిస్తున్నాయి. అయితే, ఇవన్నీ కూడా కేవలం పర్సనల్ Gmail అకౌంట్ లకు మాత్రమే వర్తిస్తుంది.

ఈ ఫీచర్ ఎప్పటి వరకు వస్తుంది?

ఈ ఫీచర్ కొన్ని దేశాల్లో ముందుగా అందుబాటులోకి రావచ్చు (ఇందులో భారత్ కూడా ఉండే అవకాశం ఉంది). అలాగే, ఈ ఫీచర్ అందరికీ వెంటనే కనిపించకపోవచ్చు మరియు ఇది స్టెప్ బై స్టెప్ రోల్ అవుట్ అవుతుంది కాబట్టి సమయానుకూలంగా ఒకొక్కరికి చేరే అవకాశం ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo