Gold Rate: వారం రోజుల దిగువకు బంగారం ధర.!

Gold Rate: వారం రోజుల దిగువకు బంగారం ధర.!
HIGHLIGHTS

వారం రోజుల కనిష్ఠానికి బంగారం ధర

గోల్డ్ రేట్ ఈరోజు గత వారం రోజుల దిగువకు చేరుకుంది

ఈరోజు గోల్డ్ అప్డేట్ ఎలా ఉన్నదో చూడండి

Gold Rate: వారం రోజుల దిగువకు బంగారం ధర. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేట్, ఈరోజు గత వారం రోజుల దిగువకు చేరుకుంది. వాస్తవానికి, ఈరోజు బంగారం ధరలో ఎక్కువ మార్పులు చోటు చేసుకోకపోయినా, ఈ వారం మొత్తం మార్కెట్ ను పరిశీలిస్తే మాత్రం వారం రోజుల కనిష్టానికి గోల్డ్ రేట్ చేరుకుంది. జనవరి 26 నుండి ఈరోజు వరకూ గోల్డ్ మార్కెట్ ను పరిగణలోకి తీసుకోవడం జరిగింది. మరి ఈ వారం రోజుల గోల్డ్ మార్కెట్ మరియు ఈరోజు బంగారం ధర అప్డేట్ ను పరిశీలిద్దామా. 

Gold Rate:

జనవరి 26న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 53,100 రూపాయలుగా ఉండగా, వారం మొత్తం మీద 600 రూపాయలు క్రిందకు దిగి రూ.52,500 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,930 నుండి 660 రూపాయలు తగ్గి, రూ.57,270 రూపాయల వద్ద కొనసాగుతోంది. గత మూడు రోజుల నుండి గోల్డ్ మార్కెట్ స్థిరంగా కొనసాగుతోంది.   

ఈరోజు బంగారం ధర

ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,500 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,270 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,500 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,270 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,650 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.57,430 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,380 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,230 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo