Gold Rate: ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ పైన లుక్కేద్దామా..!

Gold Rate: ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ పైన లుక్కేద్దామా..!
HIGHLIGHTS

నిన్న వారం రోజుల కనిష్ఠాన్ని నమోదు చేసిన గోల్డ్ మార్కెట్

ఈరోజు మళ్ళి పెరుగుదలను చూసింది

ఈ సంవత్సరంలో 60 వేల మార్క్ ను దాటుతుందని చెబుతున్న నిపుణుల మాటలను మాత్రం తోసిపుచ్చలేము

Gold Rate: నిన్న వారం రోజుల కనిష్ఠాన్ని నమోదు చేసిన గోల్డ్ మార్కెట్, ఈరోజు మళ్ళి పెరుగుదలను చూసింది. అయితే, మార్కెట్ లో ఈరోజు పెరిగిన బంగారం ధర చాలా స్వల్పమే కాబట్టి పసిడి ప్రియులు చింతించవలసిన అవసరం లేదు. కానీ, బంగారం ధర ఈ సంవత్సరంలో 60 వేల మార్క్ ను దాటుతుందని చెబుతున్న నిపుణుల మాటలను మాత్రం తోసిపుచ్చలేము. మరి ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ పైన ఒక లుక్కేద్దామా. 

Gold Rate:

నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 53,500 రూపాయలుగా ఉండగా, ఈరోజు 250 రూపాయలు పెరిగి రూ.52,750 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,270 నుండి 280 రూపాయలు పెరిగి, రూ.57,550 రూపాయల వద్ద కొనసాగుతోంది. గత మూడు రోజుల నుండి స్థిరంగా కొనసాగుతున్న గోల్డ్ మార్కెట్ ఈరోజు స్వల్పంగా పెరిగింది.   

ఈరోజు బంగారం ధర

ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,550 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,550 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,900 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.57,700 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,600 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,470 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo