Gold Price: ఈరోజు శాంతించిన గోల్డ్ సూచీలు.!

Gold Price: ఈరోజు శాంతించిన గోల్డ్ సూచీలు.!
HIGHLIGHTS

గత రెండు రోజులుగా పెరిగిన బంగారం ధర

Gold Price ఈరోజు స్థిరంగా కొనసాగుతోంది

ఈరోజు స్వల్పంగా గోల్డ్ సూచీలు క్రిందకు దిగాజారాయి

Gold Price: బంగారం ధర భారీగా పెరుగుతూ వస్తోంది. గత రెండు రోజులుగా పెరిగిన బంగారం ధర ఈరోజు స్థిరంగా కొనసాగుతోంది. రోజు రోజు పెరుగుతున్న గోల్డ్ సూచీలు ఈరోజు శాంతించాయి. వాస్తవానికి, ఈరోజు స్వల్పంగా గోల్డ్ సూచీలు క్రిందకు దిగాజారాయి. అయితే, కేవలం స్వల్పమే కాబట్టి, స్థిరంగా ఉన్నట్లు సూచిస్తున్నాము. కొత్త సంవత్సరం బంగారం ప్రియులకు చాలా చేదు అనుభవమే ఎదురవుతోంది. ఈరోజు మార్కెట్ లో గోల్డ్ రేట్ అప్డేట్ గురించి చూడండి. 

Gold Price:

నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51,600 రూపాయలుగా ఉండగా, ఈరోజు బంగారం ధర 150 రూపాయలు క్రిందకు దిగి, రూ.51,450 రూపాయల వద్దకు చేరుకుంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే, రూ.56,290 రూపాయల నుండి రూ.56,130 రూపాయల వద్దకు చేరుకుంది.

ఈరోజు బంగారం ధర

ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,450 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,130 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,450 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,130 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,600 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.56,290 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,370 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,130 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo