Gold Price Update: ఈరోజు నిలకడగా గోల్డ్ మార్కెట్..!

HIGHLIGHTS

ఈరోజు గోల్డ్ రేట్ లో పెద్దగా మార్పులు జరగలేదు

ఈరోజు గోల్డ్ మార్కెట్ స్థిరంగా కొనసాగుతోంది

నిన్న గ్రాముకు 100 రూపాయల వరకూ పెరిగిన గోల్డ్

Gold Price Update: ఈరోజు నిలకడగా గోల్డ్ మార్కెట్..!

ఈరోజు గోల్డ్ మార్కెట్ స్థిరంగా కొనసాగుతోంది. ఈరోజు మార్కెట్ ప్రారంభమైన తరువాత గోల్డ్ రేట్ లో పెద్దగా మార్పులు జరగలేదు. వాస్తవానికి, నిన్న గ్రాముకు 100 రూపాయల వరకూ పెరిగిన గోల్డ్ రేట్ ఈరోజు మాత్రం స్థిరంగా వుంది. నవంబర్ 4 న ఈ నెలలో అత్యంత కనిష్ఠాన్ని నమోదు చేసిన గోల్డ్ మార్కెట్ నిన్న అమాంతంగా పెరిగింది. అయితే, ఈరోజు బంగారం ధర పెద్ద మార్పులు లేకుండా దాదాపుగా స్థిరంగా కొనసాగుతోంది. ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలూ మరియు దేశ రాజధానిలో బంగారం ధర వివరాలను చూద్దాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Gold Price Update:

నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,000 రూపాయలుగా ఉండగా, ఈరోజు 100 రూపాయలు క్రిందకు దిగి రూ.46,900 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.51,280 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,160 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,160 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,050 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.51,320 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,700 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,100 గా ఉంది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo