మళ్ళీ కిందకు దిగుతున్న బంగారం ధర..ఈరోజు రేటు ఎంతంటే.!!

HIGHLIGHTS

బంగారం ధర గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టింది

ఈ నెలలో పెరిగి తగ్గిన బంగారం రేటు

హెచ్చుతగ్గులు బాగానే వున్నా కూడా దాదాపుగా తటస్తంగానే వుంది

మళ్ళీ కిందకు దిగుతున్న బంగారం ధర..ఈరోజు రేటు ఎంతంటే.!!

ఈ నెలలో బంగారం ధర ను పరిశీలిస్తే హెచ్చుతగ్గులు బాగానే వున్నా కూడా దాదాపుగా తటస్తంగానే వుంది. అయితే, ఈ వారం 760 రూపాయల వరకు పెరిగిన బంగారం ధర గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టింది. అయితే, భారీ తగ్గుదలను నమోదు చేసిందని మాత్రం అనుకోకండి, నిన్న 10 గ్రాములకు 100 రూపాయలు మరియు ఈరోజు 10 గ్రాములకు 220 రూపాయల చొప్పున మొత్తం ఈ రెండు రోజుల్లో 320 రూపాయల తరుగుదలను నమోదు చేసింది. ఇక ఈరోజు గోల్డ్ మార్కెట్ ను పరిశీలిస్తే 51,980 వద్ద ప్రారంభమయిన 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర, 220 రూపాయలు క్రిందకు దిగి 51,760 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశ ప్రధాన నగరాల్లో ఈ రోజు గోల్డ్ మార్కెట్ ఎలా ఉన్నదో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,650 రూపాయలుగా ఉండగా, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,450 రూపాయలుగా ఉంది. అంటే, ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ ఆర్నమెంట్ బంగారం ధర 200 తగ్గింది.  అలాగే, నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,980 కాగా, నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,760 రూపాయల వద్ద కొనసాగుతోంది.

Gold Rates 650 2.jpg

ఈరోజు బంగారం ధర

ఇక తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,760 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,760 గా ఉంది.      

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,500 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,800 గా ఉంది. ఈరోజు కూడా  దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,550 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,860 గా ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo