GOLD: రికార్డ్ స్థాయిలో పెరిగిన బంగారం ధర.!

GOLD: రికార్డ్ స్థాయిలో పెరిగిన బంగారం ధర.!
HIGHLIGHTS

బంగారం ధర రికార్డు స్థాయిలో పెరుగుదలను నమోదు చేసింది

గోల్డ్ హైక్ ఈరోజు పసిడి ప్రియులకు భారీ జట్కా ఇచ్చింది

ఈరోజు గోల్డ్ మార్కెట్ 60 వేల మార్క్ ను క్రాస్ చేసింది

GOLD: బంగారం ధర రికార్డు స్థాయిలో పెరుగుదలను నమోదు చేసింది. గత 10 రోజులుగా మొదలైన గోల్డ్ హైక్ ఈరోజు పసిడి ప్రియులకు భారీ జట్కా ఇచ్చింది. బంగారం గత 10 రోజుల్లో తులానికి దాదాపు రూ.3,000 పెరుగుదలను చూస్తే, కేవలం ఈ ఒక్కరోజే తులానికి రూ.1,600 రూపాయలకు పైగా పెరుగుదలను నమోదు చేసింది. అంతేకాదు, ఈరోజు గోల్డ్ మార్కెట్ 60 వేల మార్క్ ను క్రాస్ కూడా చేసింది. అంటే, గోల్డ్ మార్కెట్ యెంత వేగంగా దూసుకుపోతోందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే, ఈరోజు మార్కెట్ వివరాల పైన ఒక లుక్ వేద్దామా. 

Gold Rate:

ఈరోజు ప్రధాన మార్కెట్ లో రూ.50,900 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.1,500 రూపాయలు పెరిగి రూ.55,300 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, రూ.58,690 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర ఈరోజు రూ.60,320 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఈ ఈ ఒక్కరోజే రూ.1,630 రూపాయలు పెరిగినట్లు మనం చూడవచ్చు.

ఈరోజు బంగారం ధర

తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలో ఈరోజు బంగారం ధర చూస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,800 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,320 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,300 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,320 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,450 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.60,470 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన నగరాల కంటే కోయంబత్తూర్ లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు కోయంబత్తూర్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,600 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,650 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo