Gold Rate: ఈరోజు పెరిగిన బంగారం ధర..ఎంతంటే.!

Gold Rate: ఈరోజు పెరిగిన బంగారం ధర..ఎంతంటే.!
HIGHLIGHTS

గోల్డ్ మార్కెట్ ఈరోజు పెరుగుదలను నమోదు చేసింది

గత మూడు రోజులుగా నిలకడగా కొనసాగిన గోల్డ్ మార్కెట్

ఈరోజు కూడా బంగారం ధర పెరుగుదలను నమోదు చేశాయి

Gold : గత మూడు రోజులుగా నిలకడగా కొనసాగిన గోల్డ్ మార్కెట్ ఈరోజు పెరుగుదలను నమోదు చేసింది. గత నెల నుండి మొదలైన గోల్డ్ మార్కెట్ పెరుగుదల ఎంత మాత్రమూ తగ్గన్నట్లుగా పైపైకి వెళుతోంది. ఈరోజు కూడా బంగారం ధర పెరుగుదలను నమోదు చేశాయి. ఇరాక్ నిపుణుల అంచనా ప్రకారం, ఈ సంవత్సరం బంగారం ధర 60 వేల మార్క్ ను దాటవచ్చని తెలుస్తోంది. ఈరోజు మార్కెట్ లో బంగారం ధర ఎంత పెరిగింది మరియు లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకోండి. 

Gold Price:

నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,000 రూపాయలుగా ఉండగా, ఈరోజు 350 రూపాయలు పెరిగి  రూ.52,350 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే, రూ.56,730 రూపాయల నుండి రూ.57,110 రూపాయల వద్దకు చేరుకుంది.

ఈరోజు బంగారం ధర

ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,350 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,110 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,350 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,110 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,500 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.57,270 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,250 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,090 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo