Gold: ఈరోజు మార్కెట్ లో బంగారం ధర ఎలా ఉందంటే.!

Gold: ఈరోజు మార్కెట్ లో బంగారం ధర ఎలా ఉందంటే.!
HIGHLIGHTS

మార్కెట్ లో బంగారం ధర భారీగా పెరుగుదలను నమోదు చేస్తోంది

గత రెండు మూడు రోజులుగా బంగారం ధర నిలకడగా కొనసాగుతోంది

గోల్డ్ రేట్ 60 వేల రూపాయలను దాటవచ్చని కూడా నిపుణులు చెబుతున్నారు

Gold : మార్కెట్ లో బంగారం ధర భారీగా పెరుగుదలను నమోదు చేస్తోంది. అయితే, గత రెండు మూడు రోజులుగా నిలకడగా కొనసాగుతోంది. వాస్తవానికి, గత నెల నుండి గోల్డ్ మార్కెట్ ఎన్నడూ లేనంత భారీ పెరుగుదలను నమోదు చేశాయి. అంతేకాదు, గోల్డ్ రేట్ ఈ సంవత్సరంలో  60 వేల రూపాయలను దాటవచ్చని కూడా నిపుణులు చెబుతున్నారు. ఈరోజు మార్కెట్ లో బంగారం ధర అప్డేట్ గురించి తెలుసుకోండి. 

Gold Price:

శనివారం ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,200 రూపాయలుగా ఉండగా, నిన్న 150 రూపాయలు క్రిందకు దిగిన తరువాత రూ.52,000 రూపాయల వద్ద ఈరోజు స్థిరంగా కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే, రూ.56,950 రూపాయల నుండి రూ.56,730 రూపాయల వద్దకు చేరుకుంది.

ఈరోజు బంగారం ధర

ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,000 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,730 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,000 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,730 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,150 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.56,890 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,900 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,710 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo