భారీగా పెరిగిన బంగారం ధర.. ఈరోజు ధర ఎంతంటే..!!

భారీగా పెరిగిన బంగారం ధర.. ఈరోజు ధర ఎంతంటే..!!
HIGHLIGHTS

గత రెండు రోజుల్లో భారీగా పెరిగిన బంగారం ధర

ఈరోజు కూడా బంగారం ధర 350 రూపాయలు పెరిగింది

ఈరోజు గోల్డ్ మార్కెట్ ఊపందుకుంది

ఈ నెల పార్రంభం నుండి తగ్గుతూ వచ్చిన బంగారం ధర, ఊహించని విధంగా గత రెండురోజుగా పెరుగుదలను నమోదు చేసింది. ఈరోజు కూడా బంగారం ధర 350 రూపాయలు పెరిగింది. ఈరోజు బంగారం మార్కెట్  గ్రాముకు 35 రూపాయలు పెరిగి 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర 47,050 రూపాయల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుత గోల్డ్ మార్కెట్ ని పరిశీలిస్తే నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర 50,950 వద్ద కొనసాగితే, ఈరోజు మార్కెట్లో బంగారం గ్రాముకు 38 రూపాయల పెరుగుదలను నమోదు చేసి, 51,330 రూపాయల వద్ద కొనసాగుతోంది. మరి ఈరోజు మార్కెట్లో బంగారం ధర ఎలా ఉన్నదో చూద్దాం.

గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,700 రూపాయలుగా ఉండగా, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,050 రూపాయలుగా ఉంది. అలాగే, నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,950 కాగా, నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ప్రారంభ ధర రూ.51,330 గా ఉంది. అంటే, ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర 380 రూపాయలు పెరిగింది.

Gold Rates 650 11.jpg

ఈరోజు బంగారం ప్రారంభ ధర

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,050 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,330 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా ఉంది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,170 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,550 గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే,ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,170 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,330 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,050 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,330 గా ఉంది.        

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo