ఒక్కరోజే 500 పెరిగిన బంగారం ధర.. ఈరోజు ధర ఎంతంటే..!!

HIGHLIGHTS

తగ్గుతున్నట్లు కనిపించిన బంగారం ధర ఈరోజు అమాంతం పెరిగి పోయింది

గత రెండు రోజులుగా బంగారం ధర తిరిగి పుంజుకుంది

ఈరోజు గోల్డ్ మార్కెట్ ఎలా ఉన్నదో చూద్దాం

ఒక్కరోజే 500 పెరిగిన బంగారం ధర.. ఈరోజు ధర ఎంతంటే..!!

వారం ప్రారంభంలో తగ్గుతున్నట్లు కనిపించిన బంగారం ధర ఈరోజు అమాంతం పెరిగి పోయింది. గత నెల చివరి వరకూ పెరుగుతూనే వచ్చిన చివరి రోజు తరుగుదల నమోదు చెయ్యడంతో పాటుగా జూన్ 1 వ తేదీ కూడా ధర తగ్గింది. అయితే, గత రెండు రోజులుగా బంగారం ధర తిరిగి పుంజుకుంది. ఈ రోజు బంగారం ధర దాదాపుగా 540 పైగా పెరుగుదలను చూసింది.  అయితే, నిన్నటి నుండి బంగారం ధర తరుగుధలను నమోదు చేస్తోంది. ఈ రెండు రోజుల్లోనే బంగారం(10గ్రా) దాదాపుగా 540 రూపాయల పెరుగుదలను నమోదు చేసింది. ఇక ఈరోజు బంగారం ధర పరిశీలిస్తే, 51,930 వద్ద ప్రారంభమైన 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 540 రూపాయలు పెరిగి నమోదు చేసి, 52,470 వద్ద కొనసాగుతోంది. మరి ఈరోజు గోల్డ్ మార్కెట్ ఎలా ఉన్నదో చూద్దాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,600 రూపాయలుగా ఉండగా, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 48,100 రూపాయలుగా ఉంది. అలాగే, నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,930 కాగా, నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,470 వద్ద కొనసాగుతోంది. అంటే, ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర 540 రూపాయలు పెరిగింది.

gold jewellery 650.jpg

ఈరోజు బంగారం ధర

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,100 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,470 గా ఉంది. ఆశ్చర్యకరంగా ఈరోజు దేశంలోని అన్ని ఇతర నగరాలతో పాటుగా చెన్నైలో బంగారం ధర తక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,580 గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే,ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,580 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,100 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,580 గా ఉంది.          

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo