పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్..!!

Updated on 01-Jul-2022
HIGHLIGHTS

పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్

ఏకంగా 1300 రూపాయలకు పైగా పెరిగిన గోల్డ్ రేట్

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర

ఈరోజు గోల్డ్ మార్కెట్ ను చూస్తే నిజంగా పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. గత రెండు రోజులుగా భారీగా పడిపోయిన బంగారం ధర ఈరోజు ఆకాశాన్నంటింది. గడిచిన రెండు రోజుల్లో 1,000 రూపాయలకు తగ్గిన 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ ఈరోజు ఏకంగా 1300 రూపాయలకు పైగా పెరిగింది. ఈరోజు 50,890 రూపాయల వద్ద వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ ధర 1300 రూపాయలు పెరిగి 52,200 రూపాయల మార్క్ వద్ద కొనసాగుతోంది. మరి ఈరోజు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశ ప్రధాన నగరాల్లో గోల్డ్ మార్కెట్ ఎలా ఉన్నదో ఒక లుక్ వేద్దామా.

ఈరోజు నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,650 రూపాయలుగా ఉండగా, ఈరోజు గ్రాముకు 120 రూపాయలు పెరిగి, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,850 రూపాయలుకు చేరుకుంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా గ్రాముకు 130 రూపాయలు పెరిగి రూ.52,200 వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,850 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,200 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,850 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,200 గా ఉంది.  

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,850 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,200 గా ఉంది. ఈరోజు   దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే లక్నో లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు లక్నో లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,920 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,270 గా ఉంది.

ప్రతి రోజు Gold Live అప్డేట్స్ కోసం Click Here 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :