Gold: ఆపినా ఆగనంటున్న గోల్డ్ సూచీలు..ఈరోజు ఎంత పెరిగిందంటే.!

Gold: ఆపినా ఆగనంటున్న గోల్డ్ సూచీలు..ఈరోజు ఎంత పెరిగిందంటే.!
HIGHLIGHTS

ఈ వారం మొత్తం నిలకడగా కొనసాగిన గోల్డ్ ధర

గోల్డ్ ధర ఈరోజు పెరుగుదలను నమోదు చేసింది

తెలుగురాష్ట్రాల ప్రధాన నగరాలతో సహా గోల్డ్ రేట్ ఎలా కొనసాగుతోందో చూడండి

Gold: ఈ వారం మొత్తం నిలకడగా కొనసాగిన గోల్డ్ ధర ఈరోజు పెరుగుదలను నమోదు చేసింది. సోమవారం నుండి గోల్డ్ రేట్ లో పెద్దగా మార్పులేవీ కనిపించక లేదు. కానీ, వారాంతానికల్లా గోల్డ్ సూచీలు పెరుగుదలను నమోదు చేసాయి. వాస్తవానికి, గత నెల నుండి కనుక పెరిగిన గోల్డ్ రేట్ సూచీలను పరిశీలిస్తే 2000 కంటే ఎక్కువగా గోల్డ్ రేట్ పెరిగింది. ఈరోజు మన తెలుగురాష్ట్రాల ప్రధాన నగరాలతో సహా  గోల్డ్ రేట్ ఎలా కొనసాగుతోందో చూడండి.                       

Gold:

నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 50,050 రూపాయలుగా ఉండగా, ఈరోజు బంగారం ధర ఈరోజు 300 రూపాయలు పైకి ఎగబాకి, రూ.50,350 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే, ఈవారం రూ.54,600 రూపాయల నుండి రూ.54,930 రూపాయల వద్దకు చేరుకుంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలలో కొనసాగుతున్న బంగారం ధర విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,350 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,930 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,350 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,930 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,501 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.55,081 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,141 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,791 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo