ఈరోజు స్వల్పంగా పెరిగిన గోల్డ్ ధర.. ఈరోజు ధర ఎంతంటే..!!

ఈరోజు స్వల్పంగా పెరిగిన గోల్డ్ ధర.. ఈరోజు ధర ఎంతంటే..!!
HIGHLIGHTS

ఈరోజు మళ్ళీ బంగారం స్వల్పంగా పెరుగుదలను నమోదు చేసింది

ఈవారం కూడా బంగారం అదే ట్రెండ్ ను ఫాలో అయినట్లు కనిపిస్తోంది

ఇతర నగరాల కంటే పూణే లో బంగారం ధర అధికంగా నమోదయ్యింది

వారం రోజులు నుండి వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర నిన్న కొంచెం తగ్గి, ఈరోజు మళ్ళీ స్వల్పంగా పెరుగుదలను నమోదు చేసింది. గత వారంలో కూడా కేవలం ఒక్కరోజు మాత్రమే తరుదలను నమోదు చేసిన గోల్డ్, వారం మొత్తం పెరుగుదలను నమోదు చేసింది. దాదాపుగా ఈవారం కూడా బంగారం అదే ట్రెండ్ ను ఫాలో అయినట్లు కనిపిస్తోంది. ఇక ఈరోజు బంగారం ధర పరిశీలిస్తే, 10 గ్రాముల బంగారం ధర 110 రూపాయలు పెరిగింది. ఇక ఈరోజు గోల్డ్ మార్కెట్ ను పరిశీలిస్తే, ఈరోజు 51,980 వద్ద ప్రారంభమైన 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 110 రూపాయల పెరుగుదలను నమోదు చేసి, 52,090 రూపాయల వద్ద కొనసాగుతోంది. మరి ఈరోజు గోల్డ్ మార్కెట్ ఎలా ఉన్నదో చూద్దాం.

గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,650 రూపాయలుగా ఉండగా, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,750 రూపాయలుగా ఉంది. అలాగే, నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980 కాగా, నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,090 వద్ద కొనసాగుతోంది. అంటే, ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర 110 రూపాయలు తగ్గింది.

Gold Rates 650 2.jpg

ఈరోజు బంగారం ధర

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,090 గా ఉంది. ఆశ్చర్యకరంగా ఈరోజు దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే పూణే లో బంగారం ధర అధికంగా నమోదయ్యింది. ఈరోజు పూణేలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,850 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,190 గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే,ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,090 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,090 గా ఉంది.    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo