వారంలోనే 2 వేల వరకూ పెరిగిన బంగారం ధర.. ఈరోజు ధర ఎంతంటే..!!

వారంలోనే 2 వేల వరకూ పెరిగిన బంగారం ధర.. ఈరోజు ధర ఎంతంటే..!!
HIGHLIGHTS

ప్రస్తుతం బంగారం భారీగా పెరిగిపోతోంది

గత వారం నుండి అదే ట్రెండ్ నడుస్తోంది

బంగారం ధర దాదాపు 2,000 రూపాయల వరకూ పెరిగింది

ప్రస్తుతం బంగారం భారీగా పెరిగిపోతోంది మరియు గత వారం నుండి అదే ట్రెండ్ నడుస్తోంది. గడిచిన వరం రోజుల్లో బంగారం ధర పరిశీలిస్తే, 10 గ్రాముల బంగారం ధర దాదాపు 2,000 రూపాయల వరకూ పెరిగింది. ఇక ఈరోజు మార్కెట్లో గోల్డ్ చూస్తే, ఈరోజు 10 గ్రాముల బంగారం ధర 160 రూపాయల భారీ పెరుగుదలను నమోదు చేసింది. వాస్తవానికి, ఈ నెలలోనే నాలుగు నెలల కనిష్ఠాన్ని నమోదు చేసిన బంగారం, తిరిగి పుంజుకుంది. మరి ఈరోజు గోల్డ్ మార్కెట్ ఎలా ఉన్నదో చూద్దాం.

గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,750 రూపాయలుగా ఉండగా, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,900 రూపాయలుగా ఉంది. అలాగే, నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090 కాగా, నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,250 వద్ద కొనసాగుతోంది. అంటే, ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర 160 రూపాయలు పెరిగింది.

Gold Rates 650 11.jpg

ఈరోజు బంగారం ప్రారంభ ధర

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,900 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,250 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా ఉంది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,370 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,770 గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే,ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,900 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,250 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,900 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,250 గా ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo