మళ్ళీ పెరుగుతున్న బంగారం ధర.. ఈరోజు ధర ఎంతంటే..!!

మళ్ళీ పెరుగుతున్న బంగారం ధర.. ఈరోజు ధర ఎంతంటే..!!
HIGHLIGHTS

బంగారం ధర నిన్నటి నుండి పైకి ఎగబాకుతోంది

నిన్న మరియు ఈరోజు కూడా బంగారం స్వల్పంగా పెరిగింది

ఈరోజు మార్కెట్లో బంగారం గ్రాముకు రూ.44 పెరుగుదలను నమోదు చేసింది

ఈ వారం ప్రారంభం నుండి తగ్గుతూ వచ్చిన బంగారం ధర నిన్నటి నుండి పైకి ఎగబాకుతోంది. నిన్న మరియు ఈరోజు కూడా బంగారం స్వల్పంగా పెరిగింది. ఈరోజు బంగారం మార్కెట్  400 రూపాయలు పెరిగి 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర 46,700 రూపాయల మార్క్ వద్ద కొనసాగుతోంది. ఈ రెండు రోజుల గోల్డ్ మార్కెట్ ని పరిశీలిస్తే నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర 50,510 వద్ద కొనసాగితే, ఈరోజు మార్కెట్లో బంగారం గ్రాముకు 44 రూపాయల పెరుగుదలను నమోదు చేసి, 50,950 రూపాయల వద్ద కొనసాగుతోంది. మరి ఈరోజు మార్కెట్లో బంగారం ధర ఎలా ఉన్నదో చూద్దాం.

గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,300 రూపాయలుగా ఉండగా, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,700 రూపాయలుగా ఉంది. అలాగే, నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,510 కాగా, నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ప్రారంభ ధర రూ.50,950 గా ఉంది. అంటే, ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర 440 రూపాయలు పెరిగింది. ఇక, ఈరోజు గోల్డ్ మార్కెట్ ను పరిశీలిస్తే, 50,510 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ ప్రైస్ మార్కెట్ 440 రూపాయలు పెరిగి 50,950 వద్ద కొనసాగుతోంది.

Gold Rates 650 2.jpg

ఈరోజు బంగారం ప్రారంభ ధర

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,700 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,950 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా ఉంది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,860 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,210 గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే,ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,700 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,950 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,700 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,950 గా ఉంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo