మెల్లగా పుంజుకుంటున్న గోల్డ్ రేట్..లైవ్ రేట్ తెలుసుకోండి.!

మెల్లగా పుంజుకుంటున్న గోల్డ్ రేట్..లైవ్ రేట్ తెలుసుకోండి.!
HIGHLIGHTS

ఈ వారం లో గోల్డ్ రేట్ పెరగడం ఇది రెండవ సా

ఈరోజు మార్కెట్ లో బంగారం ధర మెల్లగా పుంజుకుంది

ఈరోజు తులానికి రూ. 340 రూపాయలు పెరిగిన గోల్డ్ రేట్

ఈరోజు మార్కెట్ లో బంగారం ధర మెల్లగా పుంజుకుంది మరియు ఈ వారం లో గోల్డ్ రేట్ పెరగడం ఇది రెండవ సారి. ఈ వారం లో మే 31 న గోల్డ్ రేట్ తులానికి రూ. 440 రూపాయల పెరుగుదలను నమోదు చెయ్యగా, ఈరోజు తులానికి రూ. 340 రూపాయల పేరుదలను నమోదు చేసింది. అంటే, ఈ వారం లో ఇప్పటికే దాదాపుగా రూ. 800 వరకు గోల్డ్ మార్కెట్ లాభాలను చూసింది. అయితే, గత నెల చివరి రెండు వారాల్లో గోల్డ్ రేట్ నష్టాలను చూసి 60 వేల రూపాయల మార్క్ వద్దకు చేరుకుంది. కానీ, ఈ నెల గోల్డ్ రేట్ మొదటి రెండు రోజుల్లో లాబాల బాటలో నడవడాన్ని చూడవచ్చు. 

ఈరోజు గోల్డ్ లైవ్ రేట్

ఈరోజు గోల్డ్ లైవ్ రేట్ వివరాలను చూస్తే, ఈరోజు మార్కెట్ లో రూ. 60,760 వద్ద మొదలైన 10 గ్రాముల 24క్యారెట్ బంగారం ధర 340 రూపాయలు పెరిగి రూ. 60,760 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, రూ. 55,700 రూపాయల వద్ద మొదలైన 22 క్యారెట్ ఆర్నమెంట్ బంగారం ధర రూ. 56,000 వద్ద కొనసాగుతోంది. 

తెలుగు రాష్టాల ప్రధాన నగరాలలో మరియు మరిన్ని ఇతర ప్రధాన మార్కెట్ లలో పైన సూచించిన బంగారం ధరలు కొనసాగుతున్నాయి. అయితే, గోల్డ్ లైవ్ రేట్ మరియు లోకల్ మార్కెట్ ధరలలో మార్పులు ఉంటాయని గమనించాలి.

ఇక ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మార్కెట్ లలో గోల్డ్ రేట్ ను గరిష్టంగా నమోదు చేసిన మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు చెన్నై మార్కెట్ దేశంలో గరిష్ట గోల్డ్ రేట్ ను నమోదు చేసిన మార్కెట్ గా నిలిచింది. ఎందుకంటే, ఈరోజు చెన్నై మార్కెట్ లో 10 గ్రాముల 24K గోల్డ్ రేట్ రూ. 61,505 ను నమోదు చెయ్యగా, 10 గ్రాముల 22K గోల్డ్ రేట్ రూ. 56,380 ను నమోదు చేసింది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo