Gold Price Live: ఈరోజు భారీగా పెరిగిన బంగారం ధర..!!

HIGHLIGHTS

ఈరోజు భారీగా పెరిగిన బంగారం ధర

ఈరోజు మార్కెట్ లో బంగారం ధర మరొకసారి భారీగా పెరిగింది

నిన్న కూడా మార్కెట్ లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది

Gold Price Live: ఈరోజు భారీగా పెరిగిన బంగారం ధర..!!

Gold Price Live: ఈరోజు భారీగా పెరిగిన బంగారం ధర. ఈరోజు మార్కెట్ లో బంగారం ధర మరొకసారి భారీగా పెరిగింది. కేవలం ఈరోజు మాత్రమే కాదు, నిన్న కూడా మార్కెట్ లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఇక ఈ రెండు రోజుల మార్కెట్ ను పరిశీలిస్తే, కేవలం ఈ రెండు రోజుల్లోనే దాదాపుగా 1,200 రూపాయల కంటే ఎక్కువ పెరిగింది. ఇదంతా చూస్తుంటే, బంగారం ధర ఈ సంవత్సరంలో 60 వేల మార్క్ ను దాటుతుందని చెబుతున్న నిపుణుల జోస్యం నిజమవుతుందని అర్ధంమవుతోంది. ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ ఎలా ఉన్నదో చూద్దామా. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Gold Price Live:

నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 53,000 రూపాయలుగా ఉండగా, ఈరోజు 600 రూపాయలు పెరిగి రూ.53,600 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,820 నుండి 650 రూపాయలు పెరిగి, రూ.58,470 రూపాయల వద్ద కొనసాగుతోంది. గత రెండు రోజుల్లో గోల్డ్ మార్కెట్ భారీ పెరుగుదలను నమోదు చేసింది.   

ఈరోజు బంగారం ధర

ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,600 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,470 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,600 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,470 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.58,610 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,730 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo