Gold Rate: గోల్డ్ ప్రియులకు షాక్ ..న్యూ ఇయర్ రోజు కూడా అదే జోరు.!

Gold Rate: గోల్డ్ ప్రియులకు షాక్ ..న్యూ ఇయర్ రోజు కూడా అదే జోరు.!
HIGHLIGHTS

ల్డ్ రేట్ ఈరోజు కూడా షాకించింది

గత నెల నుండి పట్టాలెక్కిన గోల్డ్ మార్కెట్

రెండు రోజుల్లోనే తులానికి 600 రూపాయల పెరుగుదలను నమోదు చేసింది

Gold Rate: ప్రజలందరూ కొత్త సంవత్సర సంబరాల్లో ఉంటే, గోల్డ్ రేట్ ఈరోజు కూడా షాకించింది. గత నెల నుండి పట్టాలెక్కిన గోల్డ్ మార్కెట్, ఇక్క ఆగనన్నట్లుగా దూసుకు పోతోంది. గత నెలతో పోలిస్తే ఇప్పటికే భారీ పెరుగుదలను నమోదు చేసిన బంగారం ధర, ఈరోజు కూడా పెరిగింది. ఈశుక్రవారం నుండి లెక్కిస్తే కేవలం రెండు రోజుల్లోనే తులానికి 600 రూపాయల పెరుగుదలను నమోదు చేసింది. అంతేకాదు, న్యూ ఇయర్ రోజు కూడా అదే జోరుతో దూసుపోతోంది. మరి ఈరోజు మార్కెట్ లో గోల్డ్ రేట్ ఎలా ఉన్నదో తెలుసుకుందామా. 

Gold Rate:

శుక్రవారం ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 50,350 రూపాయలుగా ఉండగా, శనివారం ముగిసే సమయానికి బంగారం ధర 250 రూపాయలు పైకి ఎగబాకి, రూ.50,600 రూపాయల వద్దకు చేరుకుంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే, రూ.54,930 రూపాయల నుండి రూ.55,200 రూపాయల వద్దకు చేరుకుంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలలో కొనసాగుతున్న బంగారం ధర విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,600 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,200 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,600 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,200 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.55,351 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,301 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,961 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి.  

 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo