Gold Rate: నిన్న ఈరోజు భారీగా తగ్గిన బంగారం ధర..ఈరోజు ఎంతంటే.!

Gold Rate: నిన్న ఈరోజు భారీగా తగ్గిన బంగారం ధర..ఈరోజు ఎంతంటే.!
HIGHLIGHTS

మార్కెట్ లో నిన్న మరియు ఈరోజు కూడా భారీగా తగ్గిన బంగారం ధర.

సెప్టెంబర్ 20వ తేదీ నాటికి 60 వేల రూపాయల మార్క్ వద్ద స్థిరంగా ఉన్న గోల్డ్ రేట్

ఈరోజు మార్కెట్ లో కొనసాగుతున్న బంగారం ధర పైన ఒక లుక్కేయండి

మార్కెట్ లో నిన్న మరియు ఈరోజు కూడా భారీగా తగ్గిన బంగారం ధర. 59 వేల మార్క్ వద్ద స్థిరంగా ఉన్న గోల్డ్ రేట్ సెప్టెంబర్ 15వ తేదీ నుండి బంగారం ధర స్వల్పంగా పెరుగు వచ్చి సెప్టెంబర్ 20వ తేదీ నాటికి 60 వేల రూపాయల మార్క్ ను దాటింది. అయితే, సెప్టెంబర్ 21 నుండి గోల్డ్ తగ్గడం మొదలు పెట్టింది మరియు ఈరోజు కూడా అదే దారిలో నడుస్తోంది. ఈరోజు మార్కెట్ లో కొనసాగుతున్న బంగారం ధర పైన ఒక లుక్కేయండి.

24 Carat Gold price today

ఈరోజు 24 Carat బంగారం ధర విషయానికి వస్తే, ఈరోజు ప్రధాన మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 60,050 రూపాయల వద్ద మొదలై రూ. 210 రూపాయలు క్రిందకు దిగి రూ. 59,840 రూపాయల వద్ద కొనసాగుతోంది.

Also Read: Vivo T2 Pro 5G: 64MP OIS కెమేరా మరియు 3D Curved డిస్ప్లేతో చవక ధరలో లాంచ్.!

22 Carat Gold price today

ఇక ఈరోజు 24 Carat గోల్ రేట్ ను వివరాల్లోకి వెళితే, ఈరోజు మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ. 55,050 రూపాయల వద్ద ప్రారంభమై రూ. 200 రూపాయలు క్రిందకు దిగజారి రూ. 54,850 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.

September gold rate 2023

సెప్టెంబర్ 2023 గోల్డ్ మార్కెట్ మరియు రేట్ వివరాల్లోకి వెళితే, ఈ నెలలో ప్రారంభంలో సెప్టెంబర్ 1 న రూ. 60,050 మొదలైన బంగారం ధర సెప్టెంబర్ 4 వ తేదీ రూ. 60,320 రూపాయల వద్ద పీక్ ప్రైస్ ను టచ్ చేసి మళ్ళీ క్రిందకు పడిపోయింది. అయితే, మరలా పుంజుకున్న మార్కెట్ సెప్టెంబర్ 20 వ తేదీ రూ. 60,230 రూపాయల వద్దకు చేరుకొని, నిన్న ఈరోజు రేటు తగ్గడంతో రూ. 59,840 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.

కానీ, గత నెల ప్రారంభంలో ఆగష్టు 1వ తేదికి గోల్డ్ రేట్ రూ. 60,440 రూపాయల పీక్ ధరను చూసింది. అయితే,ఆ తరువాత నెల మధ్యలో గోల్డ్ రేట్ భారీగా తరుగుదలను చూసి 59 వేల మార్క్ కు దిగిపోయింది. అయితే, నెల చివరి వాటికీ పుంజు కున్న బంగారం ధర మరలా 60 వేల మార్క్ ను చేరుకుంది.

అయితే, రానున్నది 2023 అతిపెద్ద పండుగ సీజన్ కాబట్టి గోల్డ్ రేట్ లో మార్పులు ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదే కనుక నిజమైతే రానున్న రోజుల్లో బంగారం రేటు పెరిగే అవకాశం ఉండవచ్చు. అయితే, ఇది నిపుణులు చెబుతున్న అంచనా మరియు సూచన మాత్రమే అని గుర్తుంచుకోండి.

గమనిక: ఆన్లైన్ గోల్డ్ రేట్ మరియు లోకల్ మార్కెట్ గోల్డ్ రేట్ లలో మార్పులు ఉంటాయని గమనించాలి.

Also Read: ధమాకా అఫర్: భారీ డిస్కౌంట్ తో 32 ఇంచ్ టీవీ రేటుకే 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ.!

admin
Digit.in
Logo
Digit.in
Logo