Gold: కొండెక్కిన బంగారం ధర..గోల్డ్ మార్కెట్ అప్డేట్ తెలుసుకోండి.!

Gold: కొండెక్కిన బంగారం ధర..గోల్డ్ మార్కెట్ అప్డేట్ తెలుసుకోండి.!
HIGHLIGHTS

బంగారం ధర 56 వేల రూపాయల మార్క్ ను దాటేసింది

గత రెండు రోజుల క్రితం కొంచెం క్రిందకు దిగిన బంగారం ధర

ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ తెలుసుకోండి

గత రెండు రోజుల క్రితం కొంచెం క్రిందకు దిగిన బంగారం ధర మళ్ళి పుంజుకొని 56 వేల రూపాయల మార్క్ ను దాటేసింది. ఈ వారం కూడా మారెక్ట్ ఇలాగే కొనసాగితే, కేవలం వారం లోపలే బంగారం ధర 57 వేల మార్క్ ను దాటవచ్చని నిపుణులు అంచనా వేసి చెబుతున్నారు. గడిచిన రెండు రోజుల్లోనే బంగారం ధర 700 రూపాయలకు పైగా పెరుగుధలను నమోదు చేసింది. ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ తెలుసుకోండి. 

Gold Price:

గత శుక్ర వారం ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 50,900 రూపాయలుగా ఉండగా,  రెండు రోజుల్లో బంగారం ధర 700 రూపాయలు పెరిగి, రూ.51,600 రూపాయల వద్దకు చేరుకుంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే, రూ.55,530 రూపాయల నుండి రూ.56,290 రూపాయల వద్దకు చేరుకుంది.

ఈరోజు బంగారం ధర

ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,600 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,290 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,600 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,290 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.56,440 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే కోయంబత్తూర్ లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు కోయంబత్తూర్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,600 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,380 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo