లాభాల్లో బంగారం మార్కెట్.. మరింత పెరిగిన ధర.!

లాభాల్లో బంగారం మార్కెట్.. మరింత పెరిగిన ధర.!
HIGHLIGHTS

ఈ నెల బంగారం ధర లాభాల్లో కొనసాగుతోంది

ఈ నెల ప్రారంభం నుండి బంగారం షాపులు మళ్ళీ కళ కళ లాడుతున్నాయి

ఈరోజు కూడా బంగారం మార్కెట్ ప్రారంభమవుతూనే బంగారం ధర పెరిగింది

ఈ నెల బంగారం ధర లాభాల్లో కొనసాగుతోంది. గత నెల రేటు ఎంత తక్కువగా ఉన్నాకూడా కొనుగోళ్లు లేకపోవడంతో నష్టాల్లో కొనసాగింది. అయితే, శ్రావణ మాసం కావడంతో ఈ నెల ప్రారంభం నుండి బంగారం షాపులు మళ్ళీ కళ కళ లాడుతున్నాయి. ఈరోజు కూడా బంగారం మార్కెట్ ప్రారంభమవుతూనే గ్రాముకు 40 రూపాయల చొప్పున పెరిగింది. అంటే, ఈరోజు తులం బంగారం ధర 400 రూపాయలకు పైగా పెరిగింది. ఈ నెల ప్రారంభం నుండి బంగారం ధర 1000 రూపాయలకు పైగా పెరుగుదలను చూసింది. మరి ఈరోజు దేశవ్యాప్తంగా గోల్డ్ మార్కెట్ ఎలా ఉన్నదో పరిశీలిద్దామా.

నిన్న10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,550 రూపాయలుగా ఉండగా, ఈరోజు 400 రూపాయలు పెరిగి 47,940 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు తులానికి 420 రూపాయలు పెరిగి రూ.52,300 వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,940 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,3000 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,940 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,300 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,950 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,300 గా ఉంది. ఈరోజు కూడా    దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,790 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,230 గా ఉంది.

ప్రతి రోజు Gold Live అప్డేట్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo