పసిడి ప్రియులకు షాక్.. దూసుకెళుతున్న గోల్డ్ మార్కెట్..!

పసిడి ప్రియులకు షాక్.. దూసుకెళుతున్న గోల్డ్ మార్కెట్..!
HIGHLIGHTS

అందనంత ఎత్తులో గోల్డ్ మార్కెట్

రెండు రోజుల్లో తులానికి 700 రూపాయలకి పైగా పెరిగిన గోల్డ్ రేట్

గోల్డ్ రేట్ మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణుల సూచన

ఇప్పటికే అందనంత ఎత్తులో గోల్డ్ మార్కెట్ చేరుకుందని పసిడి ప్రియులకు ఆలోచనలో పడగా, గడిచిన రెండు రోజుల్లో తులానికి 700 రూపాయలకి పైగా పెరిగిన గోల్డ్ రేట్, పసిడి ప్రియులకు షాకిచ్చింది. గోల్డ్ మార్కెట్ ఇప్పటికే 55 వేల రూపాయల మార్క్ చేరుకోగా ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. డాలర్ విలువ మారాకంతో పాటుగా గోల్డ్ లాభసాటి పెట్టుబడిగా ఇన్వెస్టర్లు  చూడటం వలన గోల్డ్ మార్కెట్ సూచీలు రోజురోజు మరింత పైకి ఎగబాకుతున్నాయి. అంతేకాదు, గోల్డ్ ఈ సంవత్సరం 60 వేల మార్క్ ను దాటినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కూడా నిపుణులు చెబుతున్నారు. ఇక ఈరోజు దేశంలో గోల్డ్ మార్కెట్ ఎలా ఉన్నదో తెలుసుకోండి. 

Gold Rate: 

సోమవారం ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 50,450 రూపాయలుగా ఉండగా, గడిచిన రెండు రోజుల్లో బంగారం ధర 650 రూపాయలు పెరిగి, రూ.51,100 రూపాయల వద్దకు చేరుకుంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే, రూ.55,040 రూపాయల నుండి రూ.55,750 రూపాయల వద్దకు చేరుకుంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలలో కొనసాగుతున్న బంగారం ధర విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,100 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,750 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,100 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,750 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,250 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.55,900 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,080 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,800 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo