Gold Rate: దూకుడు మీదున్న గోల్డ్ రేట్ కు బ్రేక్..ఈరోజు రేటు ఎంతంటే.!

HIGHLIGHTS

గత 15 రోజులుగా దూకుడు మీదున్న గోల్డ్ రేట్ కు ఈరోజు బ్రేక్ పడింది

ఈరోజు మార్కెట్ లో బంగారం ధర స్వల్పంగా నష్టాలను చవిచూసింది

గోల్డ్ రేట్ మరియు లేటెస్ట్ అప్డేట్ పైన ఒక లుక్కేద్దామా

Gold Rate: దూకుడు మీదున్న గోల్డ్ రేట్ కు బ్రేక్..ఈరోజు రేటు ఎంతంటే.!

Gold Rate: ఈరోజు గత 15 రోజులుగా దూకుడు మీదున్న గోల్డ్ రేట్ కు ఈరోజు బ్రేక్ పడింది. గత 15 రోజుల్లో ఆగకుండా సాగుతున్న గోల్డ్ సూచీలు ఇప్పటికే రూ. 4,500 రూపాయలకు పైగా పైకి చేరుకున్నాయి. అయితే, ఈరోజు మార్కెట్ లో గోల్డ్ మర్కెట్ నష్టాలను చూడడంతో గోల్డ్ జైత్రయాత్ర ఆగింది. బంగారం ధర నిన్న 62 వేలకి అతి చెరువులోకి వచ్చి చేరగా, ఈరోజు రేటు క్రిందకు దిగడంతో మళ్ళీ 61 వేల మార్క్ ను చేరుకుంది. ఈరోజు మార్కెట్ లో కొనసాగుతున్న గోల్డ్ రేట్ మరియు లేటెస్ట్ అప్డేట్ పైన ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Todays Gold rate

ఈరోజు మార్కెట్ లో బంగారం ధర స్వల్పంగా నష్టాలను చవిచూసింది. ఉదయం రూ.61,750 రూపాయలవద్ద ప్రారంభమైన ఒక ఒక తులం గోల్డ్ రేట్ రూ. 300 రూపాయల నష్టాన్ని చూసి రూ. 61,450 రూపాయల వద్దకు చేరుకుంది.

Gold-Market-Update
గోల్డ్ మర్కెట్

24 Carat బంగారం ధర

ఈరోజు మార్కెట్ లో కొనసాగుతున్న 24 carat బంగారం ధర విషయానికి వస్తే, ఈరోజు రూ.61,750 వద్ద మొదలైన 10 గ్రాముల బంగారం ధర రూ. 300 రూపాయలు క్రిందకు దిగి రూ. 61,450 రూపాయల వద్ద ఈరోజు క్లోజింగ్ ను సెట్ చేసింది.

Also Read : Amazon Sale నుండి భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతున్న QLED Smart Tv డీల్స్.!

22 Carat బంగారం ధర

ఇక 22 Carat బంగారం ధర విషయానికి వస్తే, రూ. 56,600 రూపాయల వద్ద మొదలైన 10 గ్రాముల 22 carat బంగారం ధర రూ. 56,350 రూపాయల వద్ద ఈరోజు క్లోజింగ్ ను సెట్ చేసింది.

గత వారం vs ఈ వారం

గత వారం vs ఈ వారం గోల్డ్ మార్కెట్ ను పరిశీలిస్తే, గతం వారం ప్రారంభంలో కూడా మొదటి రెండు ఈరోజు, అంటే అక్టోబర్ 16 మరియు అక్టోబర్ 17 తేదీ లలో బంగారం ధర స్వల్పంగా నష్టాలను చూసింది. అయితే, తరువాత పుంజుకున్న గోల్డ్ రేట్ దాదాపుగా రూ. 1,800 వరకూ పెరుగుదలను నమోదు చేసింది.

మరి చూడాలి ఈ వారం బంగారం ధర ఎటువంటి పరిణామాలను చూస్తుందో వేచి చూడాలి. ఎందుకంటే, నిపుణుల మాటల ప్రకారం గోల్డ్ రేట్ 63 వేల మార్క్ ను దాటవచ్చని తెలుస్తోంది. అయితే, ఇది అంచనా మాత్రమే సుమండీ.

గమనిక : ఆన్లైన్ గోల్డ్ రేట్ మరియు లోకల్ మార్కెట్ గోల్డ్ రేట్ లలో ఉంటాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo