Gold Rate: ఈరోజు భారీగా తగ్గిన బంగారం ధర..!!

HIGHLIGHTS

ఈరోజు బంగారం ధర భారీగా తగ్గింది

గత మూడు నెలల కనిష్ఠానికి చేరువకు చేరుకుంది

ఈరోజు గోల్డ్ సూచీలు భారీగా పతనమయ్యాయి

Gold Rate: ఈరోజు భారీగా తగ్గిన బంగారం ధర..!!

ఈరోజు బంగారం ధర భారీగా తగ్గింది మరియు గత మూడు నెలల కనిష్ఠానికి చేరువకు చేరుకుంది. జూన్ నెలలో ఇప్పటి వరకూ బంగారం ధర ఒకరోజు పెరిగితే ఒకరోజు తగ్గుతూ, దాదాపుగా ఒకే రేటువద్ద తిరుగుతోంది. అయితే, ఈరోజు మాత్రం గోల్డ్ సూచీలు భారీ గానే పతనమయ్యాయి. ఈరోజు గోల్డ్ మార్కెట్ ని పరిశీలిస్తే ఈరోజు 51,980 వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ ధర 900 రూపాయల భారీ తరుగుదలను నమోదు చేసి 51,000 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఈరోజు  తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశ ప్రధాన నగరాల్లో గోల్డ్ మార్కెట్ ఎలా ఉన్నదో పరిశీలిద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈరోజు నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,650 రూపాయలుగా ఉండగా, ఈరోజు గ్రాముకు 90 రూపాయలు తగ్గి, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,750 రూపాయలుకు చేరుకుంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా గ్రాముకు 90 రూపాయలు తగ్గి రూ.51,000 వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

Gold Rates 650 2.jpg

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,000 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,000 గా ఉంది.    

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,000 గా ఉంది. ఈరోజు   దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,630 గా ఉంది.

ప్రతి రోజు Gold Live అప్డేట్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo