Gold Rate Update: ఈరోజు స్వల్పంగా తగ్గిన బంగారం ధర.!

Gold Rate Update: ఈరోజు స్వల్పంగా తగ్గిన బంగారం ధర.!
HIGHLIGHTS

దూసుకుపోతున్న గోల్డ్ రేట్ కి ఈరోజు బ్రేకులు పడ్డాయి

మార్కెట్ లో ఈరోజు బంగారం ధర స్వల్పంగా క్రిందకు దిగజారింది

ఈరోజు గోల్డ్ మార్కెట్ ఎలా ఉన్నదో చూడండి

Gold Rate Update: గత వారం రోజులుగా దూసుకుపోతున్న గోల్డ్ రేట్ కి ఈరోజు బ్రేకులు పడ్డాయి. మార్కెట్ లో ఈరోజు బంగారం ధర స్వల్పంగా క్రిందకు దిగజారింది. అయితే, ఇది కేవలం నామమాత్రపు తరుగుదల మాత్రమే. వాస్తవానికి, గత నెల నుండి గోల్డ్ సూచీలు రాకెట్స్ లా దూసుకుపోతున్నాయి. అంతేకాదు, గోల్డ్ ఈ సంవత్సరం 60 వేల మార్క్ ను నమోదు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని, నిపుణులు చెబుతున్నారు. ఈరోజు గోల్డ్ మార్కెట్ ఎలా ఉన్నదో చూడండి. 

Gold Rate Update: 

నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 50,600 రూపాయలుగా ఉండగా, ఈరోజు బంగారం ధర 150 రూపాయలు క్రిందకు దిగజారి, రూ.50,450 రూపాయల వద్దకు చేరుకుంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే, రూ.55,200 రూపాయల నుండి రూ.55,040 రూపాయల వద్దకు చేరుకుంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలలో కొనసాగుతున్న బంగారం ధర విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,450 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,040 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,450 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,040 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,601 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.55,201 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,501 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,181 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo