Gold Price: భారీగా తగ్గిన బంగారం ధర .. ఈరోజు ధర ఎంతంటే..!!

HIGHLIGHTS

దూకుడుగా ఉన్న బంగారం ధర వారాంతానికి తగ్గుముఖం పట్టింది

900 వందల రూపాయల వరకూ బంగారం ధర తగ్గింది

ఈరోజు మార్కెట్లో 22 క్యారెట్ బంగారం ధర 48,990 నుండి ప్రారంభమయింది

Gold Price: భారీగా తగ్గిన బంగారం ధర .. ఈరోజు ధర ఎంతంటే..!!

గత వారం ప్రారంభం నుండి దూకుడుగా ఉన్న బంగారం ధర వారాంతానికి తగ్గుముఖం పట్టింది. గత వారంతో పోలిస్తే ఈరోజు బంగారం 10 గ్రాముల ధర దాదాపు 900 వందల రూపాయల వరకూ బంగారం ధర తగ్గింది. ఈ వారం మొదలవుతూనే ఈరోజు మార్కెట్లో 22 క్యారెట్ బంగారం 48,990 నుండి ప్రారంభమయింది. గత సోమవారం అంటే 18వ తేదికి 22 క్యారెట్ల బంగారం 49,850 రూపాయలుగా వుంది. ఇక 24 క్యారెట్ స్వచ్చమైన బంగారం ధర ఈరోజు 53,440 నుండి ప్రారంభమయ్యింది. వాస్తవానికి, ఏప్రిల్ నెలలో 22 క్యారెట్ బంగారం ధర 50 వేల మార్కును టచ్ చేసింది. మరి ఈరోజు తెలుగు రాష్టాలతో సహా ప్రధాన నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, గత వారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర (గత సోమవారం) 49,850 రూపాయలుగా ఉండగా, నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ప్రారంభ ధర 48,990 రూపాయలుగా ఉంది. అలాగే, గతవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం (సోమవారం) ధర రూ.54,380 కాగా, నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ప్రారంభ ధర రూ.53,440 గా ఉంది. అంటే, వారం తిరిగి వచ్చే సరికి 10 గ్రాముల బంగారం ధర దాదాపుగా 860 రూపాయల వరకూ తగ్గింది.

Gold Rates 650 11.jpg

ఈరోజు బంగారం ధర

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,890 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,440 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా ఉంది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,440 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,940 గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,990 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,440 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,990 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,440 గా ఉంది.     

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo