వారం తరువాత ఈరోజు తగ్గుముఖం పట్టిన బంగారం ధర.. ఈరోజు ధర ఎంతంటే..!!

వారం తరువాత ఈరోజు తగ్గుముఖం పట్టిన బంగారం ధర.. ఈరోజు ధర ఎంతంటే..!!
HIGHLIGHTS

బంగారం ధర ఈరోజు తగ్గుముఖం పట్టింది

బంగారం ధరకు ఈరోజు బ్రేకులు పడ్డాయి

ఈరోజు గోల్డ్ మార్కెట్ ఎలా ఉన్నదో చూద్దాం

గత వారం రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు తగ్గుముఖం పట్టింది. గడిచిన వారం మొత్తం పైకి ఎగబాకిన బంగారం ధరకు ఈరోజు బ్రేకులు పడ్డాయి. అయితే, ఈరోజు తగ్గిన బంగారం ఇదే ట్రెండ్ ను ఫాలో అవుతుందా లేదా మళ్ళి పెరుగుతుందో వేచిచూడాలి. ఇక ఈరోజు బంగారం ధర పరిశీలిస్తే, 10 గ్రాముల బంగారం ధర 270 రూపాయల వరకూ తగ్గింది. ఇక ఈరోజు మార్కెట్లో గోల్డ్ చూస్తే, ఈరోజు 52,280 వద్ద ప్రారంభమైన 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 270 రూపాయల తరుగుదలను నమోదు చేసి, 51,980 రూపాయల వద్ద కొనసాగుతోంది. మరి ఈరోజు గోల్డ్ మార్కెట్ ఎలా ఉన్నదో చూద్దాం.

గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,900 రూపాయలుగా ఉండగా, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,650 రూపాయలుగా ఉంది. అలాగే, నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,250 కాగా, నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,980 వద్ద కొనసాగుతోంది. అంటే, ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర 270 రూపాయలు తగ్గింది.

gold jewellery 650.jpg

ఈరోజు బంగారం ధర

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,980 గా ఉంది. ఆశ్చర్యకరంగా ఈరోజు దేశంలోని అన్ని ఇతర నగరాలతో పాటుగా చెన్నైలో బంగారం ధర నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,980 గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే,ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,980 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,980 గా ఉంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo