రెండు రోజుల్లోనే రూ.1,000 తగ్గిన బంగారం ధర.. ఈరోజు ధర ఎంతంటే..!!

HIGHLIGHTS

ఈ వారం ప్రారంభం నుండి బంగారం ధర భారీగా పడిపోయింది

నిన్న ఒక్కరోజే 750 రూపాయలు తగ్గిన 10 గ్రాముల బంగారం ధర

ఈరోజు బంగారం ధర మరింత దిగువకు చేరుకుంది

రెండు రోజుల్లోనే రూ.1,000 తగ్గిన బంగారం ధర.. ఈరోజు ధర ఎంతంటే..!!

ఈ వారం ప్రారంభం నుండి బంగారం ధర భారీగా పడిపోయింది. అంతేకాదు, నిన్న ఒక్కరోజే 750 రూపాయలు తగ్గిన 10 గ్రాముల బంగారం ధర ఈరోజు అదే దారిలో మరింత దిగువకు చేరుకుంది. ఇక గడిచిన 10 రోజుల ట్రేన్ చూస్తే కూడా, మద్యలో హెచ్చు తగ్గులు వచ్చినా కూడా ఓవరాల్ గా 1,150 రూపాయల వరకూ 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం తగ్గింది. నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర 46,450 వద్ద కొనసాగితే, ఈరోజు మార్కెట్లో బంగారం ధర 46,250 రూపాయల వద్ద ముగిసింది. అంటే, ఈరోజు కూడా 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర 200 రూపాయలు తగ్గి, 46,250 రూపాయల వద్ద కొనసాగుతోంది. మరి ఈరోజు మార్కెట్లో బంగారం ధర ఎలా ఉన్నదో చూద్దాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,450 రూపాయలుగా ఉండగా, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,250 రూపాయలుగా ఉంది. అలాగే, నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,670 కాగా, నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ప్రారంభ ధర రూ.50,450 గా ఉంది. అంటే, ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర 220 రూపాయలుతగ్గింది. ఇక, ఈరోజు గోల్డ్ మార్కెట్ ను పరిశీలిస్తే, 46,450 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర మార్కెట్ 200 రూపాయలు దిగి 46,250 వద్ద కొనసాగుతోంది.

Gold Rates 650 11.jpg

ఈరోజు బంగారం ప్రారంభ ధర

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,450 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా ఉంది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,370 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,670 గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,450 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,450 గా ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo