ఒక్కరోజే రూ.1,000 తగ్గిన బంగారం ధర.. ఈరోజు ధర ఎంతంటే..!!

HIGHLIGHTS

బంగారం ధర నిన్న దారుణంగా పడిపోయింది

ఒక్కరోజే 1,000 రూపాయల వరకూ పడిపోయిన బంగారం రేటు

వారం రోజుల ట్రెండ్ చూస్తే కూడా గోల్డ్ దిగువ సూచీలనే చూపిస్తోంది

ఒక్కరోజే రూ.1,000 తగ్గిన బంగారం ధర.. ఈరోజు ధర ఎంతంటే..!!

గత నెల చివరి నుండి తగ్గుతూ వచ్చిన బంగారం ధర నిన్న దారుణంగా పడిపోయింది. కేవలం నిన్న ఒక్కరోజే 10 గ్రాముల బంగారం ధర దాదాపుగా 1,000 రూపాయల వరకూ పడిపోయిందంటే అర్ధం చేసుకోవచ్చు.  ఇక గడిచిన వారం రోజుల ట్రెండ్ చూస్తే కూడా గోల్డ్ దిగువ సూచీలనే చూపిస్తోంది. గడిచిన వారంలో 10 గ్రాముల బంగారం ధర దాదాపు 1,590 రూపాయల వరకూ తగ్గింది. నిన్న కూడా మార్కెట్లో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర 990 రూపాయలు తగ్గింది. ఇక గత నెల హైఎస్ట్ రేటుతో పోలిస్తే 2,050 రూపాయల వరకూ గోల్డ్ రేట్ తగ్గింది.  మరి ఈరోజు ఈరోజు బంగారం ధర ఎంత ఎలా ఉన్నదో చూద్దాం.   

Digit.in Survey
✅ Thank you for completing the survey!

గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, గతవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 48,990 రూపాయలుగా ఉండగా, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ప్రారంభ ధర 47,400 రూపాయలుగా ఉంది. అలాగే, గత వారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,440 కాగా, నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ప్రారంభ ధర రూ.51,710 గా ఉంది. అంటే, ఒక్క వారంలో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచమైన బంగారం ధర దాదాపుగా 1,730 రూపాయల వరకూ తగ్గింది. ఇక, నిన్న గోల్డ్ మార్కెట్ ను పరిశీలిస్తే, 48,390 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర మార్కెట్ ముగిసే సమయానికి 990 రుపాయలు తగ్గి, 47,400 వద్ద ముగిసింది. ఈరోజు కూడా బంగారం సూచీలు నెల చూపులు చూస్తున్నాయి.  

Gold Rates 650 11.jpg

ఈరోజు బంగారం ప్రారంభ ధర

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,710 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా ఉంది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,550 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,970 గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,710 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,710 గా ఉంది.    

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo