Gold: మరింత దిగువకు బంగారం ధర.. ఈరోజు ధర ఎంతంటే..!!

Gold: మరింత దిగువకు బంగారం ధర.. ఈరోజు ధర ఎంతంటే..!!
HIGHLIGHTS

ఈ నెల బంగారం ధర నాలుగు నెలల కనిష్ఠానికి చేరుకుంది

ఈ నెలలో గోల్డ్ మార్కెట్ సూచీలు నెల చూపులు చూస్తున్నాయి

ఈ నెల ప్రారంభం నుండి అదే ట్రెండ్ కొనసాగుతోంది

ఈ నెల బంగారం ధర నాలుగు నెలల కనిష్ఠానికి చేరుకుంది. ఈ నెలలో గోల్డ్ మార్కెట్ సూచీలు నెల చూపులు చూస్తున్నాయి మరియు ఈ నెల ప్రారంభం నుండి అదే ట్రెండ్ కొనసాగుతోంది. నిన్న స్పల్పంగా పెరిగి కొంచెం పైకి ఎగబాకిన బంగారం ధర ఈరోజు 450 రూపాయలు తగ్గి 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర 46,100 రూపాయల వద్ద కొనసాగుతోంది. నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర 46,550 వద్ద కొనసాగితే, ఈరోజు మార్కెట్లో బంగారం గ్రాముకు 45 రూపాయల తరుగుదలను నమోదు చేసి, 46,100 రూపాయల వద్ద కొనసాగుతోంది. మరి ఈరోజు మార్కెట్లో బంగారం ధర ఎలా ఉన్నదో చూద్దాం.

గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,550 రూపాయలుగా ఉండగా, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,100 రూపాయలుగా ఉంది. అలాగే, నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,780 కాగా, నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ప్రారంభ ధర రూ.50,290 గా ఉంది. అంటే, ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర 490 రూపాయలు తగ్గింది. ఇక, ఈరోజు గోల్డ్ మార్కెట్ ను పరిశీలిస్తే, 50,780 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ ప్రైస్ మార్కెట్ 490 రూపాయలు తగ్గి 50,290 వద్ద కొనసాగుతోంది.

Gold Rates 650 11.jpg

ఈరోజు బంగారం ప్రారంభ ధర

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,100 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,790 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా ఉంది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,280 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,580 గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే,ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,100 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,290 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,100 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,290 గా ఉంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo