భారీగా తగ్గి స్థిరపడిన బంగారం ధర.. ఈరోజు ధర ఎంతంటే..!!

భారీగా తగ్గి స్థిరపడిన బంగారం ధర.. ఈరోజు ధర ఎంతంటే..!!
HIGHLIGHTS

బంగారం ధర ఈ నెల ప్రారంభం నుండి తగ్గుముఖం పట్టింది

ఈవారంలో ఈ రెండు నెలల కనిష్ఠానికి చేరుకుంది

కేవలం ఈ పది రోజుల్లోనే 1,250 రూపాయలు వరకూ దిగువకు బంగారం ధర

గత నెలలో అమాంతంగా  పెరిగిన బంగారం ధర ఈ నెల ప్రారంభం నుండి తగ్గుముఖం పట్టింది మరియు ఈవారంలో ఈ రెండు నెలల కనిష్ఠానికి చేరుకుంది. అంతేకాదు, కేవలం ఈ పది రోజుల్లోనే 1,250 రూపాయలు వరకూ దిగువకు చేరుకుని 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర 46,250 రూపాయల వద్ద నిలిచింది. గత వారాంతం నుండి నిన్నటి వరకూ స్థిరంగా నిలిచిన బంగారం ధర ఈరోజు స్వల్పంగా పెరిగింది.

నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర 46,250 వద్ద కొనసాగితే, ఈరోజు మార్కెట్లో బంగారం గ్రాముకు 30 రూపాయల పెరుగు ధరలను నమోదు చేసి, 46,550 రూపాయల వద్ద కొనసాగుతోంది. మరి ఈరోజు మార్కెట్లో బంగారం ధర ఎలా ఉన్నదో చూద్దాం.

గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,250 రూపాయలుగా ఉండగా, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,550 రూపాయలుగా ఉంది. అలాగే, నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,450 కాగా, నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ప్రారంభ ధర రూ.50,780 గా ఉంది. అంటే, ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర 330 రూపాయలు పెరిగింది. ఇక, ఈరోజు గోల్డ్ మార్కెట్ ను పరిశీలిస్తే, 50,450 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ ప్రైస్ మార్కెట్ 330 రూపాయలు పెరిగి 50,780 వద్ద కొనసాగుతోంది.

Gold Rates 650 2.jpg

ఈరోజు బంగారం ప్రారంభ ధర

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,550 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,780 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా ఉంది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,710 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,050 గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,550 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,780 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,550 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,780 గా ఉంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo