Gold Rate: రైజింగ్ లో గోల్డ్ మార్కెట్..ఈరోజు అప్డేట్ తెలుసుకోండి.!

Gold Rate: రైజింగ్ లో గోల్డ్ మార్కెట్..ఈరోజు అప్డేట్ తెలుసుకోండి.!
HIGHLIGHTS

గోల్డ్ మార్కెట్ ఈరోజు కూడా మంచి రైజింగ్ లో దూసుకుపోతోంది

గత వారం మొత్తం నిలకడగా కొనసాగిన గోల్ మార్కెట్

ఈరోజు గోల్డ్ రేట్ పెరుగుదలను నమోదు చేసింది

Gold Rate: గోల్డ్ మార్కెట్ ఈరోజు కూడా మంచి రైజింగ్ లో దూసుకుపోతోంది. గత వారం మొత్తం నిలకడగా కొనసాగిన గోల్ మార్కెట్ ఈరోజు పెరుగుదలను నమోదు చేసింది. ఇప్పటికే పసిడి ప్రియులకు అందనంత ఎత్తుకు చేరుకున్న గోల్డ్ రేట్, ఈరోజు మరింత ఎగువకు చేరుకొని మరింత నిరాశ పరిచింది. అయితే, రీసెంట్ గా గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసిన వారికి మాత్రం మార్కెట్ పోకడ లాభాల బాటను సూచిస్తోంది. ఈరోజు మార్కెట్ లో బంగారం ధర ఎలా ఉన్నదో తెలుసుకుందామా.

Gold Price:

నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,350 రూపాయలుగా ఉండగా, ఈరోజు బంగారం ధర 350 రూపాయలు పెరిగి రూ.52,700 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే, రూ.57,110 రూపాయల నుండి రూ.57,490 రూపాయల వద్దకు చేరుకుంది. 

ఈరోజు బంగారం ధర

ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,700 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,490 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,700 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,490 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,850 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.57,650 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,551 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,421 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo