రోజు రోజుకు దారుణంగా పడిపోతున్న బంగారం ధర.!
నిన్న మార్కెట్లో తులానికి 500 రూపాయలకు పైగా పతనమైన గోల్డ్ రేట్
ఈరోజు కూడా బంగారం రేటు నిన్నటి ట్రెండ్ నే ఫాలో అవుతూ వచ్చింది
ఒక్కవారం లోపలే దాదాపుగా తులానికి 1,400 రూపాయలకు పైగా బంగారం ధర పతనమయ్యింది
ఈరోజు కూడా బంగారం రేటు నిన్నటి ట్రెండ్ నే ఫాలో అవుతూ వచ్చింది. నిన్న మార్కెట్లో తులానికి 500 రూపాయలకు పైగా పతనమైన గోల్డ్ రేట్, ఈరోజు కూడా మరింతగా పడిపోయింది. ఇక గత శుక్రవారం నుండి ఈ శుక్రవారం వరకూ గోల్డ్ మార్కెట్ ట్రేడింగ్ ను పరిశీలించినట్లయితే, ఒక్కవారం లోపలే దాదాపుగా తులానికి 1,400 రూపాయలకు పైగా బంగారం ధర పతనమయ్యింది. ఈరోజు దేశ రాజధానితో సహా తెలుగు రాష్టాల ప్రధాన నగరాలలో బంగారం ధర ఎలా కొనసాగుతోందో తెలుసుకుందామా.
Surveyనిన్న10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,500 రూపాయలుగా ఉండగా, ఈరోజు 46,400 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.50,610 వద్ద కొనసాగుతోంది.
ఈరోజు బంగారం ధర
ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,610 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,610 గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,610 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,950 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,220 గా ఉంది.
ప్రతి రోజు Gold Live అప్డేట్స్ కోసం Click Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile