సార్వత్రిక ఎన్నికలు 2019 : ఓటరు లిస్టులో మీ ఓటు ఉందా? ఒక తనిఖీ చేసుకోవడం మంచిదేగా! ఇలా చేయండి.

సార్వత్రిక ఎన్నికలు 2019 : ఓటరు లిస్టులో మీ ఓటు ఉందా? ఒక తనిఖీ చేసుకోవడం మంచిదేగా! ఇలా చేయండి.
HIGHLIGHTS

ఈ సులభమైన పద్దతితో మీ ఓటును మీరే చెక్ చేసుకోవచ్చు.

సాధారణంగా ఎన్నికలు వచ్చాయంటే అందరూ వారి ఓటుకు సంబంధించిన వివరాలను తెలుసుకునే పనిలో పడిపోతుంటారు. ఎందకంటే, మన భవిష్యత్తును నిర్ణయించేది మరెవరోకాదు, మనమే. మనం వేసే ఒక్క ఓటుతో మనం మనకు కావల్సిన వారిని ఎంచుకోవచ్చు . మన ఓటు గురించి తెలుసుకోవడానికి ఎవరెవరి దగ్గరికో వెళ్లి వారివద్దనున్న ఓటరు లిస్ట్ నుండి మన పేరును తనిఖీ చెసుకుంటూవుంటాం. కానీ ఆ అవసరం ఇప్పుడు మీకు లేదు, కేవలం మీ మొబైల్ నుండి లేదా కంప్యూటర్ నుండి మీరు మీ ఓటు వివరాలను తెసులుకోవచ్చు. అందుకోసం మీరు చేయాల్సిందల్లా, ఎలక్షన్ కమిషన్ ఓటర్ల ఓటును తనిఖీ చేసుకోవడనికి అందించిన వెబ్ సైట్ లోకి వెళ్లి అక్కడ సూచించిన కొన్ని వివరాలను అందిస్తే సరిపోతుంది. మీకు దీనిగురించి పూర్తి సమాచారాన్ని ఇక్కడ అందిస్తున్నాను.

ఇక్కడ మీరు మీ వివరాలతో పాటుగా ఓటరు ID లో ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకోవడానికి కావాల్సిన "Form 8"  మరియు అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీ మార్చుకోవడానికి అవసరమైన "Form 6" మరియు మరికొన్ని ఫారమ్లను కూడా అందుకుంటారు.  

మీ ఓటు యొక్క స్టేటస్ తెలుసుకోవడం ఎలా?

ఈ క్రింది విధంగా చేయండి.  

1.  https://electoralsearch.in వెబ్ సైట్ యొక్క పోర్టల్ లోకి ప్రవేశించాలి.

2. ఇక్కడ సూచించిన దగ్గర మీ పేరును ఎంటర్ చేయాలి

3. దాని క్రింద మీ వయసు లేదా పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాలి

4. పురును ఎంటర్ చేసిన ప్రక్క బాక్సులో మీ తండ్రి పేరు రాయండి

5. దాని క్రింద మీ జెండర్ (స్త్రీ/పురుషులు) ఎంచుకోండి

6. ఇక రెండవ ప్రధాన బాక్సులో, State అని సూచించిన దగ్గర మీ రాష్ట్రాన్ని ఇచ్చిన లిస్టు నుండి ఎంచుకోండి

7.  దాని క్రింద బాక్సులో District  అని సూచించిన దగ్గర మీ జిల్లాని ఇచ్చిన లిస్టు నుండి ఎంచుకోండి  

8. ఇక చివరిగా మీ అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీ ని ఇచ్చిన లిస్టు నుండి ఎంచుకోండి

9. అన్నింటికంటే క్రింద ఇచ్చిన "CODE" బాక్సులో అక్కడ అందించిన ఇంగ్లీష్ లెటర్స్ న్టర్ చేసి సెర్చ్ బటన్ పైన నొక్కండి

10. ఇక్కడ సెర్చ్ క్రింద మీ ఓటు వివరాలు వస్తాయి. ఇక్కడ "View Details" పైన నొక్కడంతో పూర్తి వివరాలను చూడవచ్చు. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo