Flipkart వీడియో స్ట్రీమింగ్ ప్రారంభం : ఇక అన్ని సినిమాలు, టీవీ కార్యక్రమాలు ఉచితంగ చూడొచ్చు.

Flipkart వీడియో స్ట్రీమింగ్ ప్రారంభం : ఇక అన్ని సినిమాలు, టీవీ కార్యక్రమాలు ఉచితంగ  చూడొచ్చు.
HIGHLIGHTS

ప్రీమియం కంటెంట్ కోసం వినియోగదారులు విడిగా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు

ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ఫ్లిప్‌కార్ట్ తన వీడియో స్ట్రీమింగ్ సర్వీసును  ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్ యొక్క ఈ సర్వీస్ Android వినియోగదారులకు  ఉచితంగా అందిచనున్నట్లు ప్రకటించింది. ఈ సర్వీస్ ద్వారా, వినియోగదారులు సినిమాలు, టీవీ కార్యక్రమాలు మరియు తదితర ఇతర వీడియో కంటెంట్‌లను ఉచితంగా చూడవచ్చు. ఈ సర్వీస్ కోసం ఫ్లిప్‌కార్ట్ తో వియు, డైస్ మీడియా, టివిఎఫ్, అర్రే మరియు వూట్ వాటి వీడియో కంటెంట్ ప్లాట్ఫారాలు భాగస్వామ్యులుగా వుండనున్నాయి. ఈ సర్వీస్, భాషలు మరియు అభిరుచుల ఆధారంగా వివిధ విభాగాలుగా విభజించబడి ఉంటాయి.

అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ మరియు ఇతర స్ట్రీమింగ్ సేవల మాదిరిగా, ఫ్లిప్‌కార్ట్ కూడా తన భారతీయ వినియోగదారులకు వ్యక్తిగతీకరించిన(Personalized) వీడియో కంటెంట్‌ను అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ కు కంపెనీ ఇంకా ఎటువంటి పేరు ఇవ్వనప్పటికీ, ఈ సేవ "ఫ్లిక్" పేరిట రావచ్చని అంచనా వేస్తున్నారు.

ఈ రకమైన సర్వీస్ ద్వారా,  20-30 సంవత్సరాల వయస్సులో ఉన్నవినియోగదారులను ఆకర్షించడానికి మరియు తన ప్రాచుర్యాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి కంపెనీ ప్రయత్నిస్తోందని, కంపెనీ తెలిపింది. ఇది ఎక్కువ కంటెంట్ చూడటానికి ఇష్టపడే వారికి కూడా. ఈ కొత్త సర్వీస్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఆండ్రాయిడ్ యాప్ ద్వారా మాత్రమే అందుబాటులోకి వచ్చింది. అదనంగా, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ యూజర్లు కాని వారికి కూడా ఈ సేవ ఉచితం. రానున్న రోజుల్లో, ఈ సర్వీస్ మిగిలిన వినియోగదారులకు కూడా విస్తరించబడుతుంది.

అంతకుముందు, ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కళ్యాణ్ కృష్ణమూర్తి కూడా ఈ సర్వీస్ గురించి తన ప్రకటనలో మాట్లాడుతూ "ఇ-కామర్స్ లో భాగమైనా కాని  వినియోగదారులకు కూడా ఇది ప్రత్యేకంగా ఉంటుంది. ప్రీమియం కంటెంట్ కోసం వినియోగదారులు విడిగా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు" అని పేర్కొన్నారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo