Flipkart The Big Billion Days సేల్ డేట్ అనౌన్స్ చేసింది: Smart Tv లపై భారీ డిస్కౌంట్ కన్ఫర్మ్.!
Flipkart The Big Billion Days సేల్ డేట్ ను ఈరోజు అనౌన్స్ చేసింది
025 దసరా మరియు దీపావళి పండుగ సందర్భంగా తీసుకొస్తున్న సేల్
2025 పండుగ సీజన్ ఇప్పటి వరకు వచ్చిన అన్ని పండుగ సీజన్ సేల్ కంటే మంచి డీల్స్ తెచ్చే అవకాశం ఉంటుంది
Flipkart The Big Billion Days సేల్ డేట్ ను ఈరోజు అనౌన్స్ చేసింది. 2025 దసరా మరియు దీపావళి పండుగ సందర్భంగా తీసుకొస్తున్న ఈ సేల్ నుంచి భారీ డీల్స్ మరియు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా తీసుకొస్తుంది. అయితే, 2025 పండుగ సీజన్ ఇప్పటి వరకు వచ్చిన అన్ని పండుగ సీజన్ సేల్ కంటే మంచి డీల్స్ తెచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే, ప్రభుత్వం దీపావళి సందర్భంగా ప్రకటించిన GST 2.0 రీఫార్మ్ టాక్స్ స్లాబ్ తో ఈ గొప్ప అవకాశం లభించింది. ముఖ్యంగా Smart Tv లపై భారీ డిస్కౌంట్ కన్ఫర్మ్ అని చెప్పవచ్చు. ఇది కాకుండా ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి అందించే అదనపు ఆఫర్స్ కలిపితే ఈ సారి పండుగ నిజంగా పండుగే అవుతుంది.
SurveyFlipkart The Big Billion Days Sale ఎప్పుడు మొదలవుతుంది?
ఫ్లిప్ కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 23వ నుంచి ప్రారంభం అవుతుందని ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసింది. ఇదే కాదు ఫ్లిప్ కార్ట్ ప్లస్ మరియు ఫ్లిప్ కార్ట్ బ్లాక్ మెంబెర్స్ కి 24 గంటల ముందు ఈ సేల్ యాక్సెస్ లభిస్తుందని కూడా తెలిపింది. ఈ సేల్ నుంచి అందించనున్న ఆఫర్స్ తో టీజింగ్ కూడా మొదలు పెట్టింది.

Smart Tv లపై భారీ డిస్కౌంట్ కన్ఫర్మ్ అని ఎందుకు చెబుతున్నారు?
Smart Tv లపై భారీ డిస్కౌంట్ కన్ఫర్మ్ అని చెప్పడానికి గొప్ప కారణం ఉంది. నిన్న కేంద్రం ప్రకటించిన కొత్త GST 2.0 రీఫార్మ్ టాక్స్ స్లాబ్ లో స్మార్ట్ టీవీ మరియు AC లపై భారీగా పన్ను తగ్గించింది. కొత్త టాక్స్ స్లాబ్ సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఫ్లిప్ కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్ కూడా అదే రోజు నుంచి మొదలవుతుంది కాబట్టి స్మార్ట్ టీవీ మరియు ఏసీల ధరలు భారీగా తగ్గిపోవచ్చు, అని నిపుణులు చెబుతున్నారు.
Flipkart The Big Billion Days Sale నుంచి ఎలాంటి ఆఫర్స్ ఆశించవచ్చు?
ఫ్లిప్ కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి గొప్ప ఆఫర్స్ ఆశించవచ్చు అని ఫ్లిప్ కార్ట్ స్వయంగా చెబుతోంది. ఈ బిగ్ సేల్ కోసం Axis మరియు ICICI బ్యాంక్ లను బ్యాంక్ పార్ట్నర్ గా ఎంచుకుంది. అందుకే, ఈ రెండు బ్యాంక్ కార్డ్స్ తో ఈ సేల్ నుంచి ప్రొడక్ట్స్ కొనుగోలు చేసే వారికి 10% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇది కాకుండా స్మార్ట్ ఫోన్స్, సౌండ్ బార్స్, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు మరియు మరిన్ని ప్రొడక్ట్స్ పై గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ టీజింగ్ చేస్తోంది.