Cloudflare Down: మరోసారి డౌన్ అయిన క్లౌడ్ ఫ్లేర్.. ఎఫెక్ట్ ఎంతంటే.!

HIGHLIGHTS

ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు CDN (కంటెంట్ డెలివరీ నెట్వర్క్) క్లౌడ్ ఫ్లేర్ ఈరోజు మరోసారి డౌన్ అయ్యింది

ఈ సర్వీస్ రీసెంట్ గా గత నెలలో భారీగా డౌన్ అయ్యింది

ఈ సర్వీస్ దెబ్బకు చాలా సైట్స్ రెండు గంట వరకు పని చేయలేదు

Cloudflare Down: మరోసారి డౌన్ అయిన క్లౌడ్ ఫ్లేర్.. ఎఫెక్ట్ ఎంతంటే.!

Cloudflare Down: అనేక సైట్స్ కి సర్వీస్ అందించే ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు CDN (కంటెంట్ డెలివరీ నెట్వర్క్)డ్ క్లౌడ్ ఫ్లేర్ ఈరోజు మరోసారి డౌన్ అయ్యింది. ఈ సర్వీస్ రీసెంట్ గా గత నెలలో భారీగా డౌన్ అయ్యింది. ఈ సర్వీస్ దెబ్బకు చాలా సైట్స్ రెండు గంట వరకు పని పని చేయలేదు. గత నెల ఈ సర్వీస్ తో డౌన్ అయిన వాటిలో, X ప్లాట్ ఫామ్ మరియు డౌన్ డిక్టేటర్ వంటి మరిన్ని సర్వీస్ లు ఉన్నాయి. ఈ సర్వీస్ ఈరోజు కూడా మరోసారి డౌన్ అయ్యింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Cloudflare Down: ఎప్పుడు అయ్యింది?

క్లౌడ్ ఫ్లేర్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ సర్వీస్ డౌన్ అయినట్లు డౌన్ డిక్టేటర్ నుంచి యూజర్లు రిపోర్ట్ చేయడం ప్రారంభించారు. ఈ రిపోర్ట్ మధ్యాహ్నం 2:30 నుంచి మరింత పెరిగి తారాస్థాయికి చేరుకుంది. అయితే, ఇటీవల ఈ సర్వీస్ లో కలిగిన ఇబ్బందితో పోలిస్తే ఈసారి అంత ఎక్కువ ప్రాబ్లం ఉన్నట్లు కనిపించలేదు.

Cloudflare Down

Also Read: Nothing Phone (3): 80 వేల రూపాయల ఫోన్ పై 60 వేల రూపాయల డిస్కౌంట్ అందుకోండి.!

క్లౌడ్ ఫ్లేర్ డౌన్ అయితే ఈ సర్వీస్ ప్రొవైడర్ తో సర్వీస్ అందుకునే చాలా వెబ్సైట్ కూడా డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే, డౌన్ డిక్టేటర్ నుంచి Zerodha, Crunchyroll మరియు Valorant మూడు సైట్స్ డౌన్ అయినట్లు మాత్రం డౌన్ డిక్టేటర్ లో రిపోర్ట్ అందుకుంది.

Cloudflare Down: కంపెనీ ఏమి చెబుతోంది?

ఈ విషయం గురించి కంపెనీ ముందుగా నోటిఫికేషన్ అందించింది. క్లౌడ్ ఫ్లేర్ స్టేటస్ నుంచి ఈ నోటిఫికేషన్ అందించింది. డిసెంబర్ 5వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మెయింటెనెన్స్ సర్వీసెస్ జరగుతుందని మరియు ఆ సమయంలో సర్వీస్ లో కొత్త సమయం సమస్యలు ఉండవచ్చు, అని కంపెనీ ముందే ప్రీ నోట్ అందించింది.

ఇది మాత్రమే కాదు, ఈ సర్వీస్ లో వచ్చిన లోపల గురించి రిపోర్ట్ అందుకున్న వెంటనే దానికి స్పందిస్తూ కొత్త నోటిఫికేషన్ కూడా అప్డేట్ చేసింది. ఇప్పుడు ఈ సమస్య మెల్లమెల్లగా తగ్గుతోంది. కాబట్టి, క్లౌడ్ ఫ్లేర్ తో అనుసంధానమైన సైట్స్ లో ఎటువంటి సమస్య ఉండబోదని కంపెనీ చెబుతోంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo