ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ చివరి రోజు ధమాకా అఫర్ ప్రకటించింది. LG కంపెనీ నుండి వచ్చిన డ్యూయల్ స్క్రీన్ 5G స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ సేల్ నుండి సగం కంటే ధరకే లభిస్తోంది. LG విడుదల చేసిన ఈ 5G రెడీ డ్యూయల్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్ Wing ఈ సేల్ నుండి 62% భారీ డిస్కౌంట్ మరియు మరిన్ని అఫర్ లతో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ సమయంలో Rs.69,990 రూపాయల ధరతో మార్కెట్లోకి అడుగు పెట్టింది. అయితే, ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ నుండి కేవలం Rs.29,999 రూపాయల అఫర్ ధరతో లభిస్తోంది.
Survey
✅ Thank you for completing the survey!
అధనంగా, ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2021 నుండి ICICI మరియు Axis బ్యాంక్ కార్డులతో ఈ ఫోన్ కొనేవారికి 10% తగ్గింపు అఫర్ కూడా వుంది. అలాగే, మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా ఈ ఫోన్ పైన అఫర్ చేస్తోంది. అఫర్ ధరతో నేరుగా కొనడానికి Click Here to Check Offer.
LG Wing డ్యూయల్ స్క్రీన్ తో వస్తుంది. వీటిలో పెద్ద స్క్రీన్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్ గల 6.8-ఇంచ్ FHD+ డిస్ప్లేతో వుంటుంది. మరొక డిస్ప్లే 3.9 ఇంచ్ పరిమాణంతో వుంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ ఫాస్ట్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 765G ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇది 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ జతగా వస్తుంది.
ఇక కెమెరాల పరంగా ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో, 64MP కెమెరా OIS సపోర్ట్ తో వస్తుంది. దీనికి జతగా 13MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 12MP గింబాల్ అల్ట్రా వైడ్ కెమెరా వున్నాయి. ముందు భాగంలో, 32MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ 4000mAh బ్యాటరీతో వస్తుంది.